నిమ్మగడ్డ కు రాజీనామా చేయడం తప్ప మరో దిక్కులేదా..?

P.Nishanth Kumar
నిన్నటివరకు నిమ్మగడ్డ ను ఆపేవారే రాష్ట్రంలో లేరని అనుకున్నారు ఆయనకు మద్దతు తెలిపే కొందరు నాయకులూ. ఎప్పుడైతే కోర్టు మొట్టికాయలు వేసిందో అప్పుడు అయన పక్కన ఉన్న భజన బ్యాచ్ అంతా దాక్కుంటున్నారు. ఒంటెద్దు పోకడ ఎప్పటికైనా ప్రమాదమేనని నిమ్మగడ్డ రమేష్ ని చూసి అర్థం చేసుకోవచ్చు. గత పదినెలలుగా నిమ్మగడ్డ రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే సామాన్యుడికి సైతం రక్తం మరిగేలా ఉంది.. కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అవహేళన చేస్తూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పనులు అన్నీ ఇన్నీ కావు..

అసలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది జగన్ ప్రభుత్వమా.. నిమ్మగడ్డ ప్రభుత్వమా అన్నట్లు నిమ్మగడ్డ జోరు ఓ రేంజ్ లో ఉంది.. తనను ఎవరు అపరని అనుకున్నాడో  ఏమో స్థానిక ఎన్నికలు ఎంత వద్దంటున్న వినకుండా ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ ని రిలీజ్ చేసి అందరిలో ఆసక్తిని రేకెత్తించాడు. ప్రభుత్వాన్ని కాదని నిమ్మగడ్డ చేసిన ఈ ధైర్యాన్ని మెచ్చుకున్నా కోర్టు మాత్రం మంచి బుద్ధి చెప్పింది. ఈ దెబ్బతో ఇప్పుడు ఆయనకు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి..

కోర్టు బుద్ధి చెప్పినా కూడా తన  వైఖరిని మాత్రం మార్చుకోకపోవడం ఆయన వ్యవహార శైలి ఏమిటో తెలుపుతోంది. హైకోర్టు తీర్పుపై డివిజనల్‌ బెంచ్‌లో సవాల్‌ చేస్తామని నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం ఆయన లక్ష్యాలను చెప్పకనే చెబుతోంది. మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేస్తున్న నిమ్మగడ్డ.. ఇప్పటికైనా తీరు మార్చుకుంటే శేషజీవితం ప్రశాంతంగా గడపొచ్చు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో చేసిన పొరపాట్లను దిద్దుకునే అవకాశం ఆయనకు లభించింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని.. ప్రజా స్వామ్యానికి, ప్రజలకు జరిగిన నష్టానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయడం ద్వారా.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు తాను మొదలు పెట్టిన వివాదానికి తానే ముగింపు పలికాననే సంతృపై్తనా దక్కుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: