ఆ ఇండియన్ లేడీసు.. అదరగొట్టారు.. ప్రపంచ రికార్డు సృష్టించారు..!

Chakravarthi Kalyan
భారత మహిళా పైలెట్లు ప్రపంచ రికార్డు సృష్టించారు.. సుదీర్ఘకాలం విమానం నడిపి రికార్డు క్రియేట్ చేశారు. ఏకంగా 17 గంటలపాటు ఆపకుండా విమానం నడిపారు. అందులోనూ మొత్తం ఆడ లేడీసే.. తాజాగా శాన్‌ఫ్రాన్సిస్‌కో నుంచి బెంగళూరుకు ఎయిర్ ఇండియా వాణిజ్య విమానాన్ని అంతా ఆడవాళ్లే నడిపి శభాష్ అనిపించుకుంటున్నారు. మొన్న రాత్రి 8 గంటలకు బయలు దేరిన ఈ విమానం కాక్‌పిట్‌లో అంతా ఆడవాళ్లే.. ఈ విమానం పైలెట్లుగా కెప్టెన్ జోయా, కెప్టెన్ తన్మయి, కెప్టెన్ శివాని, కెప్టెన్ ఆకాంక్ష చరిత్ర సృష్టించారు. ఉత్తరధ్రువం మీదుగా అట్లాంటిక్‌ను దాటుకొని ఈ విమానం బెంగళూరుకు వచ్చారు.  

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో నుంచి బెంగళూరుకు నాన్‌ స్టాప్‌గా 17 గంటలు ప్రయాణించారు. ఈ నాన్‌ స్టాప్‌ తొలి తొలి వాణిజ్య విమానాన్ని  భారత మహిళా పైలెట్లే నడిపారు. శాన్‌ఫ్రాన్సిస్‌కో- బెంగళూరు మధ్య ప్రయాణ సమయం 17 గంటలపైనే. ఈ నగరాల మధ్య దూరం 13 వేల 993 కిలోమీటర్లు. ఈ విమానాన్ని నడిపే వారందరూ మహిళలేనని కేంద్ర మంత్రి కూడా గర్వంగా ప్రకటించారు. ఈ విమానం కాక్‌పిట్‌లో అందరూ మహిళలే ఉంటారంటూ విమానయాన మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ మొన్న సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇంతకీ ఈ విమానాన్ని నడిపిన పెలెట్లు ఎవరో చెప్పలేదు కదా.. ఈ విమానాన్ని కెప్టెన్ జోయా అగర్వాల్‌, కెప్టెన్ పాపగారి తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావర్, కెప్టెన్ శివాని మాన్‌హాస్ నడుపుతున్నారు. ఇందులో పాపగారి తన్మయి.. మన తెలుగమ్మాయి. మొన్న శాన్‌ ఫ్రాన్సిస్కో లో బయలు దేరిన ఈ విమానం ఇండియన్ కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున బెంగళూరు చేరింది. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ప్రపంచంలోనే ఇండియా నడుపుతున్న  అత్యంత దూర వాణిజ్య విమానం ఇదే కావడం మరో విశేషం.

సమాజం ఎంతగా మారిందని చెప్పుకుంటున్నా..ఇంకా ఆడపిల్ల అంటే మన సమాజంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. అమ్మాయి పుట్టిందని తెలిస్తే బాధపడే తల్లిదండ్రులకు కొదవు లేదు.. అందుకే ఎవరైనా ప్రసవం జరగగానే.. తల్లీ బిడ్డా బావున్నారా.. అని అడగడం మాని.. అబ్బాయా.. అమ్మాయా.. అంటూ అడుగుతారు.. మరి ఈ విజయగాధ చదివిన తర్వాతైనా వారు కాస్త మారతారా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: