చైనా చెప్పింది.. భారతీయులు ఇప్పటికైనా నమ్ముతారో లేదో..?
ఇకపోతే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల కు అనుమతి ఇచ్చిన నాటి నుంచి అటు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకా కి మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తవ్వలేదని.. అప్పుడే ఈ వ్యాక్సిన్ కి అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చి ప్రజల ప్రాణాలను మోదీ సర్కార్ ప్రమాదంలో పడేస్తోంది అంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అదే సమయంలో టీకా తీసుకున్న వాలంటీర్ మృతి కూడా అందరిలో మరింత భయాందోళనలు కలిగిస్తోంది. ప్రతిపక్షాల విమర్శలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వెరసి.. రోజురోజుకు వ్యాక్సిన్ పై ప్రజల్లో అనుమానాలు ఎక్కువవుతున్నాయి.
ఇలాంటి తరుణంలో ఇటీవల చైనా పరిశోధకులు చేసిన వ్యాఖ్యలు కాస్తా కీలకంగా మారిపోయాయి. భారత వ్యాక్సిన్లు మంచివే అంటూ ఇటీవలే చైనా వ్యాఖ్యానించింది. భారత్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ లకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల చైనా శాస్త్రవేత్తలు భారత వ్యాక్సిన్ గురించి నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. రీసెర్చ్ ప్రొడక్టివిటీ పరంగా చైనా తయారుచేసిన వ్యాక్సిన్ లకు టీకాలు ఎక్కడ తీసిపోవు అంటూ చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు గ్లోబల్ మార్కెట్లో భారత్ కీలకం గా వ్యవహరిస్తుంది అంటూ చైనా శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే భారత వ్యాక్సిన్ అటు భారతీయులే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ఇక ఇప్పుడు శత్రు దేశమైన చైనా భారత వ్యాక్సిన్ గురించి అసలు నిజం చెప్పింది. మరి ఇప్పటికైనా నమ్ముతారో లేదో..