ఏలూరు వింత వ్యాధి పై ఫుల్ క్లారిటీ.. అందుకే వచ్చిందట..?

praveen
మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య భారీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బెంబేలెత్తి పోయిన  పరిస్థితులు కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రజలందరూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్న నేపథ్యంలోనే ఇక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ వింత వ్యాధి వెలుగులోకి వచ్చి అందరినీ భయాందోళనకు గురి చేసింది.  అప్పటి వరకూ ఆరోగ్యంగా ఉన్న ప్రజలందరూ ఉన్నట్టుండి ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ఎక్కడికక్కడ కుప్పకూలి పోవడం జరిగింది.

 అంతేకాకుండా వందల మంది ప్రజలకు మూర్ఛ రావడం వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తడం లాంటివి జరగడంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.  ఇక వందల మంది ప్రజలను అనారోగ్యం బారిన పడేసిన ఈ వింత వ్యాధి ఏంటి  అనేదానిపై అటు వైద్యులు కూడా ఆందోళన చెందారు అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే  వింత వ్యాధి గురించి తెలుసుకునేందుకు ఎన్నో రకాల పరీక్షలు కూడా జరిపారు.  మొన్నటి వరకు అక్కడి ప్రాంతంలో ఉన్న కలుషిత నీరు తాగడం కారణంగానే అక్కడి ప్రజలందరూ ఈ వ్యాధితో బాధపడ్డారు అని వైద్య నిపుణులు తెలిపారు.  కాగా పూర్తి స్థాయిలో ఈ వింత వ్యాధి గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి.

 అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సంచలనం సృష్టించిన అంతుచిక్కని వ్యాధి పై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక వచ్చింది.  నివేదికలు అంతుచిక్కని వ్యాధి ఎందుకు ప్రబలింది అనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. పరీక్షల నమూనాలు రోగుల రికార్డులను పరిశీలించిన వైద్య నిపుణులు అనంతరం ఓ నివేదిక ఇచ్చారు. అయితే కూరగాయలు కలుషితం కావడం వల్ల ఈ వ్యాధి వచ్చింది అని వైద్య నిపుణులు నిర్ధారించారు.  ఏలూరు మార్కెట్ కు వచ్చిన కూరగాయలు వివిధ ప్రాంతాలకు వెళ్లాయని.. అందుకే ఈ వింత వ్యాధి బాధితులు వివిధ ప్రాంతాలలో ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు వైద్యులు. ఈ వింత వ్యాధికి ఆర్గానో క్లోరైడ్ మూల కారణం అంటూ తెలిపిన వైద్యులు ఇది కూరగాయలు లోకి ఎలా వచ్చింది అనే దానిపై ఇంకా పరీక్షలు జరుగుతున్నాయి అంటూ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: