ఆ విషయంలో కేసీఆర్ గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తున్న బీజేపీ..?
అయితే బీజేపీ మాత్రం ఒక్కో వర్గాన్ని తనవైపుకు తిప్పుకుంటోంది. అందులో భాగంగా అనేక ప్రకటనలు చేస్తోంది. తాజాగా ఆ పార్టీ చేసిన ప్రకటన ఉద్యోగ వర్గాలను ఆ పార్టీకి దగ్గర చేసేలా ఉంది. అదేంటంటే.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం.. ప్రధానంగా ప్రమోషన్ల విషయం. ఈ మేరకు బండి సంజయ్ చేసిన వ్యాఖలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన ఏమన్నారంటే.. “ ఉపాధ్యాయులకు, పంచాయితీరాజ్ లో ప్రమోషన్లు లేవు.. కింది స్థాయి సిబ్బందిని సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు.
బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే.. “ 1990 నుంచి సివిల్ కానిస్టేబుళ్లకు ఇప్పటికి పదోన్నతులు లేవు... 1996 నుంచి ఎఆర్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు లేవు.. చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట పెడుతున్నారు.. పదోన్నతులు ఎందుకు ఇవ్వడంలేదు...ఆ బాధ్యత సీఎం కేసీఆర్ పై లేదా..? ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు భాజపా 2023లో అధికారంలోకి వస్తుంది...అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తాం...ప్రమోషన్ల ప్రక్రియ మొదలుపెడతాం..అంటున్నారు బండి సంజయ్.
ఉద్యోగులతో చర్చల పేరుతో సీఎం కేసీఆర్ టైమ్ పాస్ చేస్తున్నారని.. ప్రజాప్రతినిధుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ దే అని గుర్తించాలి... కాకతీయ విశ్వవిద్యాలయానికి విసిని నియమించాలని ఎబివిపి నిరసన చేస్తోంటే... పోలీసులు విద్యార్ధులపై లాఠీ ఛార్జ్ చేయడం దుర్మార్గమైన చర్య.. అని మండి పడ్డారు బండి సంజయ్. మొత్తానికి బీజేపీ తెలంగాణలో బాగానే ప్రయత్నాలు చేస్తంది. చూడాలి ఏమవుతుందో..