టీడీపీకి జేసీ ఫ్యామిలీ గుడ్ బై... ఇంతకు ఏ పార్టీలోకి జంపో...!

VUYYURU SUBHASH
ఏ పార్టీలో ఉన్నా నిత్యం ఏదో ఒక వివాదంతో సావాసం చేయ‌డం జేసీ ఫ్యామిలీకి పెట్టింది పేరు. గ‌తంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు తొలి ట‌ర్మ్‌లో వైఎస్ మంత్రి ప‌ద‌వి ఇచ్చి జేసీని గౌర‌వించారు. ఐదేళ్ల‌లో ఆయ‌న‌పై లెక్క‌లేన‌న్ని ఫిర్యాదులు రావ‌డంతో జేసీ రెండో ట‌ర్మ్‌లో వైఎస్ సీఎం అయ్యాక కేబినెట్ ప‌ద‌వి ఇవ్వ‌లేదు. అప్ప‌టి నుంచి జిల్లాలో జేసీ పెట్ట‌ని చిచ్చులేదు. చివ‌ర‌కు కాంగ్రెస్ నిల‌బెట్టిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థిని కూడా ఓడించారు. కిర‌ణ్‌కుమార్ రెడ్డి సీఎం అయినా కూడా ఆయ‌నకు కూడా కంట్లో న‌లుసులా మారారు.

చివ‌ర‌కు 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి వ‌చ్చిన వెంట‌నే జేసీ సోద‌రుల‌కు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు రావ‌డం వారు గెల‌వ‌డం జ‌రిగిపోయాయి. పార్టీ మారినా కూడా జేసీ సోద‌రుల్లో మార్పు రాలేదు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాలో ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌ల‌తో కావాల్సిన‌న్ని గొడ‌వ‌లు పెట్టుకున్నారు. జేసీ ఫ్యామిలీ అరాచ‌క రాజ‌కీయాల‌ను భ‌రిస్తూ వ‌స్తోన్న అనంత ప్ర‌జ‌లు చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లొ తొలిసారి పోటీ చేసిన జేసీ సోద‌రులు ఇద్ద‌రిని ఓడించారు.

గ‌త ఎన్నిక‌ల్లో అనంత ఎంపీగా జేసీ ప‌వ‌న్‌కుమార్ రెడ్డి, తాడిప‌త్రి ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి ఇద్ద‌రూ ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయాక ప్ర‌భాక‌ర్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. ద‌శాబ్దాలుగా తిరుగులేకుండా చ‌క్రం తిప్పిన జేసీ సోద‌రుల ప‌రిస్థితి ఇప్పుడు రెండిటికి చెడ్డ రేవ‌డిలా మారింది. వైసీపీ ప్ర‌భుత్వం వీళ్ల అరాచ‌కాల‌ను గ‌ట్టిగా టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. తాజాగా జేసీ ప‌వ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. టీడీపీ నేత‌లు క‌ర‌ణం బ‌ల‌రాం, శిద్ధా రాఘ‌వ‌రావుకు కోట్ల రూపాయలు ఫైన్ వేసి వైసీపీకి తీసుకు వెళ్లార‌ని.. త‌మ‌ను ఎంత‌లా బెదిరించినా,, ఎంత ఒత్తిడి చేసినా టీడీపీలోనే ఉంటామ‌ని చెప్పారు.

ప‌వ‌న్ రెడ్డి త‌మ ఫ్యామిలీని పార్టీ మారాల‌ని ఒత్తిడి చేసిన పార్టీ ఏదో చెప్ప‌లేదు. గ‌తంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అనంత‌పురం జిల్లాకు వ‌చ్చిన‌ప్పుడు దివాక‌ర్ రెడ్డి క‌లిశారు. అప్పుడే ఆ ఫ్యామిలీ బీజేపీలో చేరుతుంద‌న్న ప్ర‌చారం జ‌రిగినా సైలెంట్ అయ్యారు. తాజాగా ప‌వ‌న్ రెడ్డి మ‌రోసారి త‌మ‌పై పార్టీ మార‌మ‌న్న ఒత్తిడి ఉంద‌ని చెప్ప‌డంతో వాళ్లు టీడీపీని వీడ‌తార‌న్న చ‌ర్చ‌లు అయితే స్టార్ట్ అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: