విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మూడు రాజధానులు అంటూ చెప్పడమే కాకుండా , విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. విశాఖలో పరిపాలన రాజధాని గా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఎప్పుడూ వైసీపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటికే రాజధాని తరలింపునకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయిపోయింది. అమరావతి ఉద్యమం ఇంకా కొనసాగుతున్నా విశాఖ వైపే వైసీపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.  ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని తరలింపు వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సంవత్సరం ఉగాది పండుగ నుంచి విశాఖపట్నం పరిపాలన రాజధాని గా మారబోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.





 ఉగాది నుంచి చట్టపరంగా విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం రాజధాని తరలింపు విషయంలో దృఢనిశ్చయంతో ఉందనే విషయం అర్థం అయిపోయింది.ఇప్పటికే విశాఖ అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉండటం తో, కొత్తగా ఇక్కడ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని మొదటి నుంచి చెబుతోంది. పరిపాలన రాజధానికి అవసరమైన మౌలిక సదుపాయాలు విశాఖలో ఉండడం,  వాయు ,రోడ్డు ,జల రవాణాకు అనుకూలంగా ఉండటం వంటి ఎన్నో అంశాలను లెక్కలోకి తీసుకుని ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసేందుకు వైసిపి మొగ్గుచూపుతోంది.




 అయితే అమరావతి లోనే ఎట్టి పరిస్థితుల్లోను రాజధాని కొనసాగించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతుండడం, టిడిపి జనసేన బీజేపీ పార్టీలు అమరావతిలోనే రాజధానిగా ఉంచాలంటూ హడావుడి చేస్తున్నా.. జగన్ మాత్రం మూడు రాజధానుల విషయానికి కట్టుబడి ఉండడమే కాకుండా, ఉగాది నాటికి పరిపాలనా రాజధానిగా విశాఖ నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  తాజాగా బొత్స ఈ విషయం పై ప్రకటన చేయడంతో వైసీపీ ప్రభుత్వం ఎక్కడ తగ్గడం లేదనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: