బీహార్ రాజకీయాలు: నితీష్ ఒక సీఎం మాత్రమే...పెత్తనమంతా వారిదే...?
పూర్తి వివరాల్లోకి వెళితే బీహార్ లోని జేడీయూ కి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత శ్యామ్ రాజక్ చేసిన ప్రకటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. కేవలం జేడీయూ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పార్టీలోని ఎమ్మెల్యేలకు నచ్చడం లేదని ఇటీవల ఒక సమావేశంలో ఆయన ప్రస్తావించారు. అంతే కాకుండా నితీష్ కుమార్ పేరుకే సీఎం అని పెత్తనం అంతా బీజేపీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు చేస్తున్నారని తన బాధను వ్యక్తపరిచారు. సదరు ఎమ్మెల్యేలను ఆర్జేడీ పార్టీ చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని సంచలనముగా తెలిపారు ఆ పార్టీ నేత.
అయితే ఈ విధంగా ఎమ్మెల్యే లు సొంత పార్టీకి వ్యతిరేకంగా వేరొక పార్టీలో చేరడం అనే విషయం ఇప్పుడు సాధారణమైపోయింది. దీనికి ఉదాహరణలుగా కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గతంలో జరిగిన విషయాలు. కాగా అనుకోకుండా వస్తున్న ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఏవిధంగా తన ప్రణాళికను సిద్ధం చేసుకుంటారో తెలియాల్సి ఉంది. తనపై తన పార్టీ పై వస్తున్న ఆరోపణలను ఏ విధంగా తిప్పి కొడతారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే రాజక్ చేసిన వ్యాఖ్యల అనంతరం పార్టీలోని ముఖ్యమైన నేతలతో చర్చించిన నితీష్ ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కుట్ర మాత్రమే అని, మా పార్టీలోని ఎమ్మెల్యే లు అంతా మా పార్టీలోనే కొనసాగుతారని బట్టబయలు చేసారు.