వైసిపి జనసేన మధ్య రాజకీయ వేడి ఇప్పుడు ఊపందుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ, రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే పనిలో ఉన్నారు రెండు రోజుల క్రితం ,ఏపీ మంత్రి కొడాలి నాని ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయగా, దానికి కౌంటర్ గా ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఘాటుగానే సమాధానం ఇచ్చారు. తాజాగా మంత్రులు చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ కీలక నేత శివశంకర్ స్పందించారు. ఈ మేరకు విశాఖలో సమావేశం నిర్వహించి మరీ జగన్ ప్రభుత్వం పైన పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం జగన్ వెనుక ఉన్న ముగ్గురు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ , కొడాలి నాని, పేర్ని నాని ఈ ముగ్గురు తోకలు కత్తిరించిన కోతులు లాంటివారు అని విమర్శించారు.
ఈ ముగ్గురు మంత్రులకు మంత్రివర్గ సమిష్టి బాధ్యత లు ఎంత మాత్రం తెలియని , ప్రజాస్వామ్యం గురించి కానీ, రాజ్యాంగం గురించి ఓనమాలు కూడా తెలియని మంత్రులు అంటూ శివశంకర్ విమర్శించారు. ఈ ముగ్గురు మంత్రులు ఈ యుగంలో పుట్టడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అంటూ విమర్శలు చేశారు . ఏపీ మంత్రి కొడాలి నాని బూతులు మాట్లాడుతూ, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు అని, ప్రజాసమస్యలపై మాట్లాడడం లేదు అంటూ శివశంకర్ విమర్శించారు. మంత్రులు తమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని శివశంకర్ విమర్శించారు.
బూతులు మాట్లాడే వాళ్ళను పక్కన పెట్టుకుని జగన్ పరిపాలన చేస్తున్నారని విమర్శించారు.రాష్ట్రంలో రైతుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారని , తుఫాను వచ్చినప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని సీఎం జగన్ చెప్పారని, ఇప్పుడు శాసిస్తున్నారు అని రైతులు రోడ్డుపై ఉన్నారు అంటూ విమర్శించారు.