బీజేపీ కార్యకర్తలకు టార్గెట్ గా మారిన ఉండవల్లి..?

P.Nishanth Kumar
ఏపీలో బీజేపీ కార్యకర్తలు ఉండవల్లి ని టార్గెట్ చేసుకుని ఆయనపై విమర్శలు చేస్తున్నారు.. ఉండవల్లి ఇటీవలే కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు బీజేపీ పై చేయడం ఇందుకు కారణం.. కాంగ్రెస్ నేతగా, మాజీ లోక్ సభ సభ్యుడిగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్  ప్రత్యక్ష రాజకీయాలను నుంచి తప్పు కున్న ప్రభుత్వాలపై వాళ్ళ పనితీరును విమర్శిస్తుంటారు.. మంచి ఉంటే పొగుడుతారు కూడా..ఈ నేపథ్యంలో పోలవరం పై అయన ఇటీవలే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం పై ఎన్నో ప్రెస్ మీట్ లు నిర్వహించిన ఉండవల్లి ఇటీవలే బీజేపీ కార్యకర్తలకు ఆగ్రహం కలిగించేలా మాట్లాడరు.
బీజేపీలో చేరికలపై తన అభిప్రాయాన్ని జర్నలిస్టులతో పంచుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడిగా ఉన్న ఉండవల్లి ఆ తర్వాత ఆ సిద్ధాంతాలను విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. ఇందుకు గల కారణాలను ఆయన వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత కర్త గురు గోల్వాల్కర్‌ రాసిన పాంచజన్యం పుస్తకం చదివిన తర్వాతే.. తాను ఆర్‌ఎస్‌ఎస్‌ ను వీడానని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు దేశానికి మంచివి కావని కూడా చెప్పారు. బీజేపీలో చేరాలనుకుంటున్న వారు.. ముందు ఆ పుస్తకం చదివిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.
దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఉండవల్లి ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడిప్పుడే బలపడాలనుకుంటున్న బీజేపీ కి ఇది దెబ్బ పడే అవకాశమని వారు భావిస్తున్నారు.  అధికారం లేకపోతే ప్రతిపక్ష స్థానం అయినా దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పార్టీలోకి వచ్చే వారికి సాదర స్వాగతం పలుకుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతూ.. పార్టీలోకి చేరాలంటూ తాజా, మాజీ నాయకులను ఆహ్వానిస్తున్నారు. టీడీపీ తాజా, మాజీ నేతలను చేర్చుకోవాలని బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. ఆ దిశగా కొన్ని చేరికలు కూడా జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: