బ్యాంకుల ముందు చెత్త కుప్పలు వేసిన ప్రజలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..?
ప్రస్తుతం పలు బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది . దేవుడు వరమిచ్చినప్పటికీ పూజారి పర్మిషన్ ఇవ్వలేదు అన్న చందంగా మారిపోయింది ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు. రాష్ట్ర ప్రభుత్వం పేదల అందరికీ మేలు జరిగే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతుంది. కానీ అటు బ్యాంకులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఎంతో మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇలాంటి క్రమంలోనే ఇటీవల ప్రజలు వినూత్నంగా ఆలోచించి బ్యాంకు అధికారులకు భారీ షాక్ ఇచ్చారు.
కృష్ణా జిల్లా ఉయ్యూరు లో మూడు బ్యాంకుల ముందు చెత్త పోయడం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారిపోయింది. నగర పంచాయతీ కమిషనర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ప్రజలు ఆయా బ్యాంకుల ముందు చెత్తపోశారు. ఉదయం విధులకు హాజరయ్యేందుకు వచ్చే బ్యాంకు సిబ్బంది వచ్చేసరికి బ్యాంకు ముందు చెత్త చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రభుత్వం ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ నిధి, జగనన్న తోడు, వైయస్సార్ చేయూత పథకాలకు సంబంధించిన లోన్లు ఇవ్వకపోవడంతో ప్రజలు ఇలా చేసినట్లు తెలుస్తోంది. దీంతో అటు ప్రతిపక్షాలు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నాయి.