పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?

praveen
ప్రస్తుతం ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందుబాటులో ఉంచింది అనే విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక అదిరిపోయే పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ  పథకం ద్వారా ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎంతో మేలు జరుగుతుంది.  ఈ పథకంలో కేవలం ఆడపిల్లలు మాత్రమే చేరడానికి అనుమతి ఉంది.  ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల పేరుపై ఖాతా తెరిచేందుకు అవకాశం ఉంది.  కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల తల్లిదండ్రుల కోసం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచేందుకు ప్రస్తుతం ఎన్నో బ్యాంకులలో అవకాశముంది.



 ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచేందుకు అవకాశం కల్పిస్తుంది. సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఇటీవల దీనికి సంబంధించి ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ స్కీం కు సంబంధించిన పలు విషయాలను కూడా వెల్లడించింది. కాగా ప్రస్తుత అమ్మాయి పెళ్లి ఉన్నత చదువు వంటి వాటి కోసం ఈ స్కీం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.


 కేవలం 250 రూపాయల తో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ని తెరిచేందుకు అవకాశం ఉంటుంది. ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిల పేరుపై ఈ అకౌంట్ తెరిచేందుకు అవకాశం ఉంటుంది.  ఇక ఈ అకౌంట్ తెరిస్తే పన్నుమినహాయింపు ప్రయోజనాలు పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాగా  సుకన్య సమృద్ధి యోజన పథకం పై 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఇక ఈ స్కీమ్ లో  చేరిన తర్వాత ప్రతి నెల డబ్బులు కలుపుతూ వెళ్లాల్సి ఉంటుంది.  సంవత్సరానికి గరిష్టంగా 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.


సంవత్సరానికి గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. కనీసం రూ.250 చెల్లించినా సరిపోతుంది. మీరు మీ పిల్లల పేరుపై సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేయాలని భావిస్తే.. పాప బర్త్ సర్టిఫికెట్, పాన్ కార్డు, రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి.
అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గరి నుంచి 15 ఏళ్ల పాటు డబ్బులు డిపాజిట్ చేస్తూ వెళ్లాలి. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. ఉదాహరణకు మీరు మీ పాప పేరుపై తొలి ఏడాది నుంచే నెలకు రూ.5,000 డిపాజిట్ చేస్తూ వెలితే.. మెచ్యూరిటీ కాలంలో మీకు రూ.26 లక్షలకు పైగా లభిస్తాయి. ఈ డబ్బును మీ పాప పెళ్లి లేదంటే ఉన్నత చదువులకు ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: