అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఇది తప్పనిసరి.?

praveen
కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం మానవ  జీవన శైలి పూర్తిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ పుణ్యమా అని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.కరోనా వైరస్ కారణంగా దేవునికి భక్తులకు మధ్య ఎంత దూరం పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినాడు మూతపడిన ఎన్నో దేవాలయాలు..  ప్రస్తుతంకఠిన నిబంధనల మధ్య  భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రస్తుతం కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి మండలదీక్ష పూనుకున్న ఎంతోమంది భక్తులు తరలి వస్తుంటారు అన్న విషయం తెలిసిందే.

 సాధారణంగా అయితే ఇక అయ్యప్ప దర్శనానికి ప్రతి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి దీక్షను అయ్యప్ప స్వామి సమక్షంలో విరమిస్తుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎంతోమంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి ని దృష్టిలో ఉంచుకుని కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అయ్యప్ప స్వామి ఆలయంలోకి భక్తులను అనుమతించేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.  క్రమక్రమంగా భక్తుల అనుమతి సంఖ్యను పెంచుకుంటూ పోతుంది కేరళ ప్రభుత్వం. అంతేకాకుండా భక్తులు అనుమతి విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

 కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న దృశ్య శబరిమల వెళ్ళే భక్తులందరికీ కూడా కరోనా నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి అంటూ నిబంధన పెట్టింది అక్కడి ప్రభుత్వం. ఈ విషయాన్ని ఇటీవలే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి అయ్యప్ప దర్శనానికి శబరిమల వచ్చే భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఆర్ టి పి సి ఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది అనే రిపోర్టును తప్పనిసరిగా చూపించాలి అంటూ నిబంధన పెట్టింది. ఇప్పుడు వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు రెండు వేల మంది భక్తులను స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఇస్తున్నారు కానీ వచ్చే వారం నుంచి 5 వేల మంది భక్తులను అనుమతించేందుకు ఇటీవలే హైకోర్టు అనుమతి ఇచ్చింది అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: