ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో బిజెపి కంటే కొన్ని సీట్లు మాత్రమే టిఆర్ఎస్ ఆధిక్యత చూపించగలిగింది. కానీ సొంతంగా అభ్యర్థిని నిర్ణయించే స్థాయిలో టిఆర్ఎస్ ఫలితాలను దక్కించుకోలేకపోయింది. టిఆర్ఎస్ తరువాత బీజేపీ, ఆ తరువాత మూడో స్థానంలో ఎంఐఎం నిలిచింది. ఎంఐఎం టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, ఆ పార్టీ మద్దతు తీసుకుంటే రాజకీయంగా రానున్న రోజుల్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు, మరెన్నో అవమానాలు ఎదురు అవుతాయి అనే ఉద్దేశంతో కెసిఆర్ ఎంఐఎం తో పొత్తు పెట్టుకునేందుకు ఇష్టపడడం లేదు. అలాగే బిజెపి తరఫున గెలిచిన కొంతమంది కార్పొరేటర్లు ఇతర పార్టీలలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఉన్నారు. వారికి ఆ పార్టీలో సీటు దక్కపోవడంతో, బిజెపిలో చేరి విజయం సాధించారు అటువంటి వారిని సులభంగా తమవైపు తిప్పుకోవచ్చు అనే ఉద్దేశంలో టిఆర్ఎస్ ఉన్నట్లుగా బిజెపి అనుమానిస్తోంది.
అంతే కాకుండా మరికొంత మంది కార్పొరేటర్లను టిఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేసుకొని, వారితో మంతనాలు చేస్తున్నారు అనే అనుమానామాతో బీజేపీ ఉంది. దీంతో ముందుగానే టిఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, విరుచుకుపడుతోంది. కార్పొరేటర్ల జోలికి వస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాము లాక్కోవాల్సి ఉంటుంది అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని బిజెపి జోలికి వస్తే ఏం చేస్తామో చేసి చూపిస్తాము అంటూ సంజయ్ ఫైర్ అయ్యారు. ఇక బీజేపీ నుంచి ఎవరూ బయటకి వెళ్లకుండా అందరిపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టి జరుగుతున్న.. జరగబోతున్న అన్ని పరిణామాలను అంచనా వేస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: