10వేల మంది రోగులకు 5 బెడ్లు.. ఎనిమిది మంది డాక్టర్లు..?

praveen
దేశంలో  వైద్య సేవల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే.  వైద్యుల కొరత భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొన్ని ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మటుకు దేశంలోని చాలా ఆసుపత్రులలో మాత్రం వైద్యుల కొరత..  అంతేకాకుండా పేషెంట్లకు సరిపడా అభ్యర్థులు లేకపోవడంతో ఎంతోమంది పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు దేశంలో వైద్య సేవల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోతుంది అని పలు సర్వేలు కూడా చెబుతున్నాయి అనే విషయం తెలిసిందే



 ముఖ్యంగా ఈ 2020 సంవత్సరం లో కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చి  ఎంతోమంది ప్రస్తుతం ఆసుపత్రి పాలైన నేపథ్యంలో వైద్యుల కొరత మరింత తీవ్రం గా మారిపోయింది అంతేకాకుండా ఆసుపత్రుల్లో వైద్యసేవల కొరత కూడా తీవ్రంగా మారిపోవడంతో ప్రజలు ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇక ఇటీవలే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో భాగంగా భారత దేశంలో వైద్య సేవల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అన్నది బయటపడింది. ఇక ఇటీవలే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2020 లో భాగంగా భారతదేశం వైద్యసేవలు అందించడంలో దారుణ స్థితిలో ఉంది. ఏకంగా 155 వ స్థానంలో ఉంది.



 అయితే ఈ నివేదికలో భారత్ తర్వాత... ఉగాండా నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి 12 దేశాలు మాత్రమే ఉండటం గమనార్హం. అంతేకాకుండా భారతదేశంలో పదివేల మంది రోగులకు గాను కేవలం 8.6 మంది వైద్యులు మాత్రమే ప్రస్తుతం ఉండగా.. ఇక బెడ్ ల సంఖ్య కేవలం 5 మాత్రమే ఉండడం భారత దేశంలో వైద్య పరిమాణాలు ఎంత దీన స్థితిలో ఉన్నాయో అని చెప్పకనే చెబుతున్నాయి. అయితే భారతదేశంలో సగటు మనిషి ఆయుర్దాయం 69.7 సంవత్సరాలు ఉండగా ఆఫ్ఘనిస్తాన్ లో 72.6 శాతంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: