ఒక కేసుకు రెండు కేసులు.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం..?

praveen
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ ప్రభుత్వం ఎంతో దూకుడుగా వ్యవహరిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నాయకుడైన టిడిపి నేతలపై ఉన్న అక్రమాలను బయటపెడుతూ కేసులు పెడుతోంది. అయితే.. అటు  టిడిపి మాత్రం వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా నే టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతోంది అంటూ విమర్శల పర్వం కొనసాగిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి వరుసగా జగన్మోహన్రెడ్డి సర్కార్ టీడీపీ కీలక నేతల పై కేసులు బనాయిస్తూ ఉండడం.. ముమ్మర విచారణ చేపడుతు ఉండడం మరింత ఆసక్తికరం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 ఇప్పటికే టిడిపి లోని కీలక నేతల పై జగన్ సర్కార్ పలు కేసులు పెట్టి విచారణ కొనసాగిస్తుంది అయితే దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ  విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ సర్కార్ కావాలనే అక్రమ కేసులు బనాయిస్తూ టిడిపి నేతలను  ఇబ్బందులకు గురిచేస్తున్నారని  ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారు  అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు అనే విషయం తెలిసిందే.  అయితే జగన్ సర్కార్ వరుసగా టిడిపి నేతలపై కేసులు పెడుతుండటం పై మరోసారి స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదని.. అక్రమ కేసులు పెడితే మౌనంగా ఉండద్దు అంటూ టీడీపీ శ్రేణులకు సూచించారు చంద్రబాబు నాయుడు. పోలీసులు ఒక కేసు పెడితే రెండు ప్రైవేట్ కేసులు పెట్టాలి అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఒకవేళ పోలీసు ఫిర్యాదులు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాము అంటూ చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కాస్త ఆంధ్ర రాజకీయాలలో  ఆసక్తికరంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: