జగన్ అరెస్టు: నేటికి నెల

 హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడు, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయ్యి బుధవారం నాటికి సరిగ్గా నెల. అక్రమ ఆస్తులు, తన కంపెనీలకు అక్రమ పెట్టుబడులు రాబట్టి మనీలాండరింగ్కు పాల్పడ్డారంటూ కేసులు నమోదయ్యాయి. జగన్ కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది.  9నెలల కిందట కేసు నమోదైనప్పటికీ...సరిగ్గా రాష్ర్టంలో ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ జగన్కు సీబీఐ కోర్టుకు మే 28న రావల్సిందిగా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ లోపే సీబీఐ అధికారులు గత నెల 25న సీబీఐ విచారాణకు పిలిచింది. వరుసగా మూడు రోజుల పాటు జగన్ను విచారణ జరిపిన సీబీఐ అధికారులు 27న అరెస్టు చేసినట్లు ప్రకటించి సంచలనంరేపింది. కోర్టుకు హాజరు కావడానికి సమన్లు జారీ చేసిన దానికంటే ముందుగానే ఒక రోజు అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు స్రుష్టించింది.  దర్యాప్తు చేస్తున్న సీబీఐ తీరును ముందు నుంచీ వైకాపా తప్పుబడుతోంది. వారు చేస్తున్నట్లుగానే సీబీఐ వ్యవహారించిన తీరు వుందంటున్నారు. కేసును నమోదు చేసి నెలలు దాటినా...ఏనాడు జగన్ను విచారణకు పిలువకుండానే ఛార్జిషీట్లను దాఖలు చేయడాన్ని వైకాపా ఖండిస్తోంది. గత నెల కిందట తొలిసారిగా జగన్ను సీబీఐ కోర్టు ప్రత్యేక స్థానానికి హాజరుపర్చగా తొలుత 14రోజుల జుడీష్యయల్ రిమాండు విధించింది.  అయితే, తాము విచారణ చేసినందుకు కస్టడీ ఇవ్వాలనీ సీబీఐ కోర్టులో పిటీషన్ వేసింది. 5రోజుల కస్టడీకి ఇచ్చారు. తరువాత కోర్టులో హాజరుపర్చిన సందర్భంగా కోర్టు మరోమారు రిమాండును జూలై 4వరకు పొడగించారు. జుడీష్యయల్ రిమాండులో ఉన్న సందర్భంగా జగన్ భద్రత విషయంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వైకాపా ఆరోపించింది. ఒకానొక సందర్భంలో న్యాయమూర్తి కూడా జగన్ భద్రత విషయంలో సంబంధిత అధికారులకు అంక్షితలు వేశారు. అయినప్పటికీ జగన్ భద్రత విషయంలో అధికారులు తీసుకోవల్సిన చర్యలు తీసుకోవడం లేదనీ ఇప్పటికీ వైకాపా అంటోంది. జగన్ను నెల రోజులుగా జైలులో ఉన్నారు.  ఈ నెలలో ఆయనకు కేసుకు సంబంధం వుందనీ అదే జైలులో ఉన్న మరి కొందర్ని విచారించేందుకు ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టర్లు కూడా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. విచారణను పూర్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఫోన్ కాల్స్ కూడా మరో సంచలనంరేపాయి. ఫోన్ కాల్స్ డేటా గురించి అటు చంద్రబాల, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, ఇటు వైకాపా నేత విజయమ్మ ఒకిరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఏది ఏమైనా అందరూ ప్రతి నిత్యం ఈ కేసు గురించి చర్చించుకుంటున్నారు. రాష్ర్టంలో అనేక సమస్యలున్నప్పటికీ ఎవరూ మాట్లాడటం లేదు. మీడియా కూడా ఈ కేసుకు ఇస్తున్నంత ప్రాధాన్యత రైతులు, ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ఇవ్వడం లేదు. చర్చ పెట్టడం లేదు. మాట్లాడకపోవడం విచారకరమనే చెప్పాలి.  ఇప్పటికైనా మీడియా, విశ్లేషకులు, పరిశీలకులుగా చెప్పుకునే మేధావులు కాస్త మిగతా సమస్యల గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. ఆ దిశగా తమవంతు క్రుషి చేయాలనీ మనమూ ఆశిద్ధాం. మొత్తానికి జగన్ కేసు ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: