
నేడు కేసీఆర్ సిద్ధిపేట పర్యటన.. కారణం అదే..?
దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టిన అభివృద్ధి పనులకు ఎన్నికల కోడ్ కారణంగా బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు అంతా సాధారణ స్థితికి రావడంతో మళ్లీ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే నేడు సిద్దిపేటలో భారీ అభివృద్ధి పనులకు ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు కూడా చేసేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఏకంగా సిద్దిపేటలో 870 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధిపేట లో పర్యటించనున్నారు నేడు. సిద్ధిపేట లో 870 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అదే సమయంలో సిద్దిపేటలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లకి లబ్ధిదారుల సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం పొన్నాల సమీపంలో నిర్మించిన టిఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనంతరం పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రజలను ఉద్దేశించి బహిరంగసభలో ప్రసంగించారు.