వైరల్ అవుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వింత లీవ్ లెటర్..!

N.ANJI
లీవ్ లెటర్ ని స్కూల్ లో చదివేటప్పుడు ఎక్కువగా రాసేవాళ్ళం. ఇక స్కూల్ కి వెళ్లలేకపోతే రకరకాల కారణాలు చెప్పి లీవ్ లెటర్ రాసే వాళ్ళం. ఎక్కువగా కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం అని రాసేవాళ్ళు. తర్వాత ఎప్పడు పెద్దగా రాయాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల్లో అంటే లీవ్ లెటర్ లతో పెద్దగా పరిచయం లేదు ఎందుకంటే అన్ని మెయిల్ లోనే జరిగిపోతాయి. కానీ కొన్ని ప్రభుత్వ సంస్థల్లో ఇప్పటికి సెలవు కావాలంటే పై అధికారులకు లీవ్ లెటర్ రాయాల్సిందే. తాజగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రాసిన లీవ్ లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ పై అధికారులకు సెలవుల కోసం ఓ లెటర్ రాశాడు. అందులో 5 రోజులు సెలవులు కావాలని కోరాడు. అయితే ఆ లెటర్‌లో అతడు చూపిన కారణం, ఆ లెటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కానిస్టేబుల్ ఎవరు, ఆ లెటర్‌లో ఏం ఉందో చూద్దామా…!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ‌లోని భూపాల్ ‌కు చెందిన దిలీప్ కుమార్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు ఇటీవల పై అధికారులకు లీవ్ కోసం లెటర్ రాశాడు. ఇప్పుడు ఆ లెటర్ పెద్ద చర్చకు దారి తీయడంతో పాటు అతడిపై చర్యలకు దిగేలా చేస్తున్నాయి.

అయితే దిలీప్ కుమార్ తనకు ఐదు రోజులు సెలవు కావాలని పై అధికారులను కోరారు. తన బావమరిది పెళ్లి ఉందని తెలిపాడు. ఒకవేళ పెళ్లికి తాను హాజరు కాకపోతే పరిస్థితులు దారుణంగా మారుతాయని తనని తన భార్య బెదిరించిందని ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే పై అధికారులు లీవ్ ఇవ్వకపోగా… లెటర్‌లో రాసిన విధానం సరిగ్గా లేదని అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో కానిస్టేబుల్ దిలీప్ పరిస్థితి దయనీయంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: