ఒక్క మాటతో తేల్చిచెప్పిన మోడి.. దీనిపై ఆలోచించాల్సిందే..?

praveen
మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి కొత్త చరిత్రకు నాంది పలికింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న సంస్కరణలు నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా పునరుద్ధరించి ప్రజలందరికీ మేలు జరిగే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. కాగా కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఒక చారిత్రాత్మకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న విషయం తెలిసిందే.



 పెద్ద నోట్ల రద్దు అనే నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త చరిత్రకు నాంది పలికింది ఇక ఆ తర్వాత జిఎస్టి తీసుకొచ్చి మరో చరిత్ర సృష్టించింది. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఎలాంటి వణుకు బెణుకు లేకుండా వెనకడుగు వేయకుండా కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగింది ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి సరికొత్త సంస్కరణలు రైతులకు మేలు చేసే విధంగా తీసుకు వచ్చింది అనే విషయం తెలిసిందే.  అయితే కొత్త సంస్కరణలు తీసుకు రాకముందు నుంచే విపక్షాలు మాత్రం తీసుకురావద్దు అంటూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ చట్టాల పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒకే ఒక్క ప్రశ్న తో ప్రస్తుతం తేల్చి చెప్పేశారు...పాత చట్టాలతో కొత్త శతాబ్దంలో కి ఎలా అడుగుపెట్టాలి అంటూ ప్రశ్నించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎలాంటి కొత్త సంస్కరణలు లేకుండా పాత చట్టాలతో కొత్త శతాబ్దంలోకి  ఎలా వెళ్దాం అంటూ అడిగిన ప్రశ్న ప్రస్తుతం ఆలోచించదగ్గది  అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చేసి రైతుకు కాస్త చేయూతనిచ్చేందుకు తీసుకొచ్చిన సంస్కరణలపై...  వ్యతిరేకత వ్యక్తం చేసుకున్నవారు మోడీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: