మేం సిద్ధంగా ఉన్నాం.. స్కూళ్లు ప్రారంభించండి సారూ.. కేసిఆర్ కి లేఖ..?

praveen
ప్రస్తుతం కరోనా  వైరస్ పరిస్థితుల నేపథ్యం లో విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పుడు  మూతపడిన విద్యా సంస్థలు ఇప్పటికీ కూడా పలు రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల లో విద్యార్థుల విద్యా సంవత్సరం పాడవకూడదు అనే ఉద్దేశం తో రాష్ట్ర ప్రభుత్వాలు  విద్యా సంస్థను ప్రారంభించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే.  కొన్ని రాష్ట్రాలలో మాత్రం ఇప్పటివరకు విద్యాసంస్థలు తెరుచుకోలేదు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.



 ప్రస్తుతం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ విద్యాసంస్థలను తెరిచింది ప్రభుత్వం. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ విద్యాసంస్థలను పునఃప్రారంభం పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం.  అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణలో వరుసగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో... విద్యాసంస్థల ప్రారంభం పై దృష్టి సారించడం లేదు ప్రభుత్వం. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు విద్యాసంస్థలను తెరుస్తారు అన్న దానిపై పూర్తి స్థాయిలో క్లారిటీ లేకుండా పోయింది ఈ క్రమంలోనే అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.




 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి లేఖ రాసారు. రాష్ట్రప్రభుత్వం స్కూళ్లు  తెరిచేందుకు నిర్ణయం తీసుకుంటే తాము విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ లేఖలో పేర్కొన్నారు.  కనీసం తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని కోరారు తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చంద్రప్రకాష్. స్కూళ్లు  ప్రారంభించడంతో పాటు కరోనా వైరస్ నిబంధనలకు అనుగుణంగా స్కూళ్లను శానిటేషన్ చేయడంతోపాటు మాస్కులు తప్పనిసరిగా అందించాలి అంటూ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: