ఆంధ్రాలో విషాదం..పెళ్లికి పెద్దలు నో అనడంతో దారుణానికి పాల్పడిన జంట..

Satvika
ఈ మధ్య జంట హత్యలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి.. మైనర్ ల ప్రేమ లేఖ కులాంతర ప్రేమలు, పెళ్లికి పెద్దలు కాదన్నారనీ చాలా మంది ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇటీవల ఒక నెలలోనే నాలుగు జంటలు ఆత్మ హత్య చేసుకున్నారు.. ఆ ఘటన పూర్తిగా తేలక ముందే ఇప్పుడు మరో ఘటన కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి మైనర్ బాలికను ప్రేమించాడు. యువతి కూడా అతన్ని ఘాడంగా ప్రేమించింది. అయితే వారి పెళ్లికి నో అనడంతో ఎలుకల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు..



వివరాల్లోకి వెళితే.. ఈ అమానుష ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో జరిగింది. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామంలో ఈ దారుణం వెలుగు చూసింది.శ్రీకాంత్ అనే వ్యక్తి గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు.అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. రెండు రోజుల కిందట అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు.ఉలవపాడు మండలం కరేడు ర్యాంపు వద్దకు చేరుకుని అక్కడే ఓ హోటల్ వెనుక రాత్రంతా ఎముకలను కోరికేస్తున్న చలిలోనే గడిపారు. 



ఇక పెద్దల మనసు కరగదని తెలుసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నారు.. అలానే తమ వెంట తెచ్చుకున్న ఎలుకల మందును మింగారు.అనంతరం బాలిక ఇంటికి ఫోన్ చేసి ఎలుకల మందు తిన్నట్లు చెప్పడంతో వెంటనే ఆమె కుటుంబ సభ్యులు కరేడు ర్యాంపు వద్దకు చేరుకున్నారు.అస్వస్థతతకు గురైన ఇద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్సులో ఒంగోలు రిమ్స్‌కి తరలించారు..గతంలో వీరిద్దరూ కలిసి లేచిపోయినట్లు తేల్చారు. అంతేకాదు పెద్దలు పంచాయితీ కూడా జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. విషం ప్రభావం ఎక్కువ అవ్వడంతో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ప్రాణాలను విడిచారు. చేతికి వచ్చిన పిల్లలు ఇలా ప్రేమ పేరుతో చనిపోవడంతో ఇరు కుటుంబాలు సోకంలో మునిగారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: