తెలుగుదేశం ఎమ్మెల్యే పై నిప్పులు వెదజల్లిన జగన్...
ఎలక్షన్స్ కి కేవలం ఆరు నెలల ముందు దాకా రాష్ట్రంలో 44 లక్షలు మాత్రమే ఇచ్చారని.. జగన్ అధికారం లోకి వచ్చాక 61.94 లక్షల పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. టీడీపీ అధికారంలో వున్నప్పుడు పెన్షన్ బిల్లు రూ.500 కోట్లు కూడా లేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వంలో నెలకు 1500 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో ఇస్తున్నామన్నారు. టీడీపీ నేతలు ఓ పద్ధతి ప్రకారం అబద్ధాలు చెబుతూ.. మోసాలు చేస్తున్నారని జగన్ కోప్పడ్డారు. తాము ఎన్నికలకు ముందు ఏం చెప్పామన్నది మేనిఫెస్టోలో రాశామని, ఆ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తామన్నారు సీఎం.
సభలో టీడీపీ సభ్యుడు రామానాయుడుపై సీఎం జగన్ కోప్పడ్డాడు.అన్నీ అబద్ధాలు చెబుతూ.. ఉద్దేశపూర్వకంగా సభను తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు.అతను సభలో శాశ్వతంగా మాట్లాడుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ తర్వాత సభా నాయకుడి సూచన మేరకు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడిపై సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి చర్యలు కొనసాగుతాయని స్పీకర్ తెలిపడం జరిగింది. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...