అదిరిపోయే ఆఫర్.. రోజుకు యాభై రూపాయలు డిపాజిట్ చేస్తే చాలు..?

praveen
ఈ మధ్యకాలంలో తక్కువ పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో ఎక్కువ రాబడి పొందేందుకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే కానీ కొన్ని కొన్ని ప్రయత్నాలు మాత్రమే ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉంటాయి. అయితే ఇలా ప్రతిరోజు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో మంచి రాబడి పొందాలనుకునే వారికి అదిరిపోయే అవకాశం ప్రస్తుతం అందుబాటులో ఉంది, అయితే దీని కోసం ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు... మీ దగ్గరలో ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లి ఆర్ డి అకౌంట్ తెరిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఎంతోమంది రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతున్నారు అనే విషయం తెలిసిందే.

 అయితే ఈ రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేసి ప్రతి నెలా కొన్ని డబ్బులు డిపాజిట్ చేస్తూ వెళ్లాలి నెలకు వంద రూపాయల నుంచి డిపాజిట్ చేసేందుకు ఖాతాదారులకు అవకాశం ఉంటుంది. అయితే మీరు ప్రతి నెల ఎంత మొత్తంలో డిపాజిట్ చేస్తున్నారు అనేదాన్ని బట్టి మీరు దీర్ఘకాలంలో ఎంత పొందుతారు అనేది అనేది కూడా ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఉంటుంది. మీరు రోజుకు 50 లేదా 100 రూపాయలు ఆదా చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో లక్ష రూపాయల వరకు పొందేందుకు అవకాశం ఉంటుంది.

 సాధారణంగా అయితే పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్ళు ... ఒకవేళ మీరు కావాలనుకుంటే మెచ్యూరిటీ కాలాన్ని మరో ఐదేళ్ల వరకు పొడిగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరిచి ప్రతి నెల 1500 వరకు డిపాజిట్ చేస్తే... 5 ఏళ్ల తర్వాత 1.05 లక్షల వరకు ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం 5.8 శాతం వరకు ఉంటుంది. ఒకవేళ మెచ్యూరిటీ కాలాన్ని మరో అయిదేళ్లు పొడిగించుకుని  పదేళ్ల వరకు డిపాజిట్ చేస్తూనే వెళ్తే అప్పుడు 2.75 లక్షల వరకు ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. అదే పదిహేనెళ్ళు  డిపాజిట్ చేస్తే చేతికి ఏకంగా 4.3 లక్షలు పొందేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: