చైనా లక్ష్యం నెరవేరుతుంది.. ప్రపంచం నివ్వెరపోతుంది..?

praveen
సాధారణంగా లక్ష్యం కోసం పని చేయడానికి ఏ దేశమైనా ఎంతగానో శ్రమిస్తుంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటు చివరకు ఎంతో కష్టపడి పట్టుదలతో లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుంది.  కానీ చైనా వ్యూహం మాత్రం ఎంతో విభిన్నంగా ఉంటుంది... లక్ష్యం కోసం శ్రమించడం కాదు ఎంతో సులభంగా లక్ష్యాన్ని ఛేదించేందుకు ఎన్నో నీచమైన  ప్లాన్స్  వేస్తూ ఉంటుంది చైనా. ఈ గ్రామంలోనే ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చైనా వేసిన కరోనా  వైరస్ ప్లాన్  చైనా లక్ష్యాన్ని క్రమక్రమంగా నెరవేరుస్తుంది అనే విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్  నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం చైనాను వదిలేసింది.

 కానీ ప్రపంచ దేశాలు మాత్రం పట్టిపీడిస్తోంది అన్న విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తం రోగగ్రస్తమై పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తర్వాత చైనా ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు కరోనా  వైరస్ అనే ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే చైనా ప్లాన్ చేసిన విధంగానే ప్రస్తుతం ప్రపంచం మొత్తం సంక్షోభంలో కూరుకుపోతోంది. అగ్రరాజ్యాలకు లో కూడా ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అన్ని రకాల వ్యవస్థలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.  దీంతో ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంది. ఇదే సమయాన్ని సరైన సమయంగా భావిస్తోన్న చైనా ఆర్థిక వ్యవస్థను అంతకంతకు మరింత పటిష్టంగా మార్చుకునేందుకు సిద్ధమైంది.

 ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకు పోతున్న సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ మాత్రం పుంజుకుంటుంది. చైనాలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ మునుపెన్నడూ లేని విధంగా విపరీతంగా పనులు ప్రారంభించారు. ఇప్పటికిప్పుడు ప్రపంచదేశాలలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ డెవలప్  చేసే అవకాశం లేదు కాబట్టి ఇండైరెక్టుగా వివిధ దేశాలకు చెందిన ఎన్నో కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆర్థికంగా అన్ని దేశాలపై ఏకచ్ఛత్రాధిపత్యానికి సాధించాలి అనుకున్న చైనా లక్ష్యం క్రమక్రమంగా నెరవేరుతుంది అని ప్రస్తుతం విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: