ఇంట్లో కూర్చుని ఆదాయం సంపాదించండి.. అదిరిపోయే బిజినెస్ ఐడియా..?
డబ్బులు సంపాదించడానికి మాత్రం మీకు వంటలు చేయడం తెలిసి ఉండాలి . వంటలు చేయడం తెలిసి ఉంటే చాలు మంచి రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి ఎంతోమంది కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేస్తూ సేవలు అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇటీవలే స్విగ్గి ఒక సరికొత్త యాప్ తీసుకువచ్చింది. స్విగ్గీ డైలీ యాప్ ద్వారా స్విగ్గి లో ఇంట్లో చేసిన వంటలను కస్టమర్లకు డెలివరీ చేస్తున్నారు. దీని ద్వారా మీరు మంచి రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది.
దీనికోసం మీరు రెస్టారెంట్ ఓపెన్ చేసి భారీగా డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన పని కూడా లేదు. రుచికరంగా వంట చేయడం వస్తే భారీగా ఆదా యాన్ని సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. రుచిగా వంట చేయడం వచ్చిన వారు స్విగ్గీ డైలీ యాప్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఇక ఈ యాప్ ను మూడు రోజులు లేదా ఏడు రోజులు నెల రోజులు ఇలా సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు స్విగ్గి ప్రతి ఆర్డర్కు 50 నుంచి 150 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ఇక ఇంటి వంటకం కోరుకునే వారికి మీరు చేసిన వంటను డెలివరీ చేస్తుంది. ఇక ఈ సదుపాయం కేవలం గురుగ్రాం లో మాత్రమే అందుబాటులో ఉండగా రానున్న రోజుల్లో అన్ని పట్టణాల్లో కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.