గ్రేటర్ యుద్ధం : సర్వం సిద్ధమైంది..?

frame గ్రేటర్ యుద్ధం : సర్వం సిద్ధమైంది..?

praveen
రేపు జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో  ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో హాట్ హాట్ గా మారిపోయాయి పరిస్థితులు. నిన్నటి వరకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించారు అని చెప్పాలి. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు కూడా చేశారు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. కాగా నేడు జిహెచ్ఎంసి ఎన్నికల్లో  ఎలాంటి ప్రచారం ఉండబోదు అన్న విషయం తెలిసిందే. అయితే రేపు ఎంతో ప్రతిష్టాత్మకంగా జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. ప్రస్తుతం దీని కోసం సర్వం సిద్ధం చేస్తుంది తెలంగాణ ఎన్నికల సంఘం.



 ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల కోసం పోలింగ్ నిర్వహణను చూసుకునేందుకు 48 వేల మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఎన్నికల సంఘం తెలిపింది. గ్రేటర్ పరిధిలో 36 డిఆర్సి  కేంద్రాలు ఉండగా.. ఆయా కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణ సిబ్బంది కి ఈరోజు పోలింగ్ సామాగ్రిని అందించనున్నారు. కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో వెయ్యి మంది ఓటర్లకు మించి ఉండకుండా ఉండేలా ప్రస్తుతం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది  ఎన్నికల సంఘం. అదే సమయంలో కరోనా వైరస్ బాధితులకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తోంది.


 అయితే ఇన్ని రోజుల వరకు ముమ్మర ప్రచారం చేపట్టి ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. గ్రేటర్ పరిధిలోని ఓటర్లు కూడా సరైన అభ్యర్థులను ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ పార్టీ ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇన్ని రోజుల వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రచారం చేపట్టిన అభ్యర్థులందరూ లో కూడా ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: