వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో..!?

N.ANJI
నిమ్మకాయతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాల మంది నిమ్మకాయను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే రోజూ ఉదయాన్నే ఓ గ్లాస్ వేడి నీళ్లు తీసుకుని, ఓ నిమ్మకాయ రసాన్ని కలుపుకొని తాగుతుంటారు. రోజూ నిమ్మరసం తాగుతూ ఉంటే బాడీకి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. వేడి నీటితో నిమ్మరసాన్ని తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే ఔషధ గుణాలు నిమ్మర‌సంలో ఉన్నాయి. దీంతో అధిక బ‌రువు ఉన్నవారు నిమ్మర‌సం తాగితే ఫ‌లితం ఉంటుంది. రోజూ ఇలా తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగవుతుంది. గుండె సంబంధ స‌మ‌స్యలు కూడా దాదాపు రావు. డయాబెటిస్ ఉన్నవాళ్లు నిమ్మర‌సం తాగితే, ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. మ‌ధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది.

వేడి నీటితో నిమ్మరసం తీసుకుంటే, బాడీలో పొటాషియం స్థాయి పెరుగుతుంది. సిట్రేట్ లెవెల్స్ కూడా మెరుగవుతాయి. ఫలితంగా కిడ్నీలో రాళ్లు నెమ్మదిగా కరిగిపోతాయి. నిమ్మర‌సంలో యాంటీ ఆక్సిడెంట్లు, సి విట‌మిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. స‌హ‌జ సిద్ధమైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాలు ఉండడం వ‌ల్ల చాలా ర‌కాల ఇన్‌ఫెక్షన్లు తేలిగ్గా తగ్గిపోతాయి.

ఇక నిమ్మరసం కిడ్నీలోనే కాదు గాల్ బ్లాడర్‌లో రాళ్లను కూడా తరిమికొడుతుందని నిపుణులు తెలిపారు. ఫలితంగా కడుపునొప్పి సమస్య తీరుతుంది. ఇందుకోసం రోజూ వేడి నీటి నిమ్మరసం తాగాల్సిందే. రోజూ నిమ్మర‌సాన్ని తాగితే జీర్ణాశ‌య స‌మ‌స్యలు రావు. ప్రధానంగా గ్యాస్‌, ఏసీడీటీ, మ‌ల‌బ‌ద్దకం, అజీర్ణం వంటివి మనకు తెలియకుండానే తగ్గిపోతాయి.

నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల చ‌ర్మానికి మేలు చేస్తుంది. స్కిన్ మెరుస్తుంది. మృదువుగా, కోమలంగా త‌యార‌వుతుంది. ముడ‌త‌లు, మ‌చ్చలు పోతాయి. నొప్పులు, వాపులు ఉన్నవారు నిమ్మర‌సం తాగితే ఫ‌లితం ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది బాగా ఉప‌క‌రిస్తుంది. ఫ్లూ జ్వరం, ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్యలకు చక్కటి పరిష్కారం వేడి నీటి నిమ్మరసం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: