జనసేన హైదరాబాద్ లో చేసిన పని తిరుపతి లో చేస్తే అంతే..?

P.Nishanth Kumar
తెలంగాణాలో గ్రేటర్ ఎన్నికల జోరు రోజు రోజు కి ఉధృతమవుతోంది. అన్ని పార్టీ లు ఇక్కడ విజయ కేతనం ఎగురవేయాలని చూస్తుంది. టీ ఆర్ ఎస్ పార్టీ ఇప్పటికే అన్ని కసరత్తులు పూర్తి చేసింది.. ఇంకా ప్రచారమే మిగిలింది. దుబ్బాక లో పోయిన పరువును ఇక్కడ గెలిచి నిలబెట్టుకోవాలని చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగాచారంగా తయారైంది.. ఇక్కడ పోటీ చేసి టైం చేసే బదులు ఆగిపోతే బెటర్ అని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ గెలుపు పై కాంగ్రెస్ కి ఇంకా ధీమా పోలేదు.  ఇక బీజేపీ దుబ్బాక లో గెలిచినా ఉత్సాహంతో ఇక్కడ బరిలో దిగి గెలుపును కొనసాగించాలనుకుంటుంది. అయితే ఈ మూడు పార్టీలతో పాటు టీడీపీ కూడా ఇక్కడ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది.. దాదాపు 90 స్థానాల్లో టీడీపీ పోటీచేస్తుందని టీడీపీ చెప్తుంది.. ఇక జనసేన, వైసీపీ ఈ పోటీ లో ఉండట్లేవని క్లారిటీ వచ్చేసింది..
వైసీపీ ఏమో కానీ జనసేన ఈ పోటీ నుంచి తప్పుకోవడం కొంత వివాదానికి దారి తీస్తుంది. బీజేపీ కి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నాడు.  అందుకు కారణం పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న ఈ ఏరియా లో జనసేన పోటీ చేయకపోవడం అయన అభిమానులకు నిరాశని కల్గించింది.దీంతో ఇప్పుడు జనసైనికుల చూపు.. తిరుపతి వైపు పడింది. తిరుపతిలోనూ బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ త్యాగం చేసేస్తారేమోనని కంగారు పడుతున్నారు.
పవన్ కల్యాణ్.. తాను ప్రారంభించిన పార్టీ కంటే ఎక్కువగా బీజేపీ కోసం తపించిపోతున్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. తిరుపతి స్థానానికి ఉపఎన్నిక ఖాయమని.. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించిన రోజే అందరికీ తెలుసు. అన్ని పార్టీలు ఇందు కోసం అంతర్గతంగా కసరత్తు చేశాయి. టీడీపీ అధినేత అభ్యర్థిని ఖరారు చేసేశారు. తాము మాత్రం ఎందుకు వెనుకబడటం అని.. వైసీపీ అధినేత జగన్ కూడా.. అభ్యర్థిని ఖరారు చేశారు. ఇక అందరి చూపు.. బీజేపీ-జనసేన వైపు పడింది. ఆ కూటమి తరపున ఎవరు పోటీచేస్తారు.. అభ్యర్థి ఎవరవుతారన్న దానిపై చర్చ ప్రారంభమయింది.అయితే హైదరాబాద్ లో లా జనసేన బీజేపీ కి సపోర్ట్ చేతమంటే కుదరదు ప్రత్యక్ష రాజకీయాల్లో జనసేన ఉండాల్సిందే అని పట్టుబడుతున్నారు. అందరిని రెచ్చగొట్టి చివరికి వచ్చే సరికి పవన్ ఇలా తుసమనిపించడం ఫాన్స్ కి నచ్చడం లేదు..మరి తిరుపతి విషయంలో పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: