భర్త జీతం ఎంతో తెలుసుకునే హక్కు భార్యకు ఉంది.. కండీషన్స్ ఇవే..!
అయితే కండీషన్స్ అప్లై అంటూ చిన్న తిరకాసు పెట్టింది. ఈ రూల్ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది అని వెల్లడించింది. భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే.. అతని గ్రాస్ శాలరీ ఎంతో… ట్యాక్సబుల్ ఇన్‌కమ్ ఎంతో ఆర్టీఏతో తెలుసుకోవచ్చని సీఐసీ వివరించింది. అయితే ఆర్టీఏ ద్వారా అప్లై చేసిన 15 రోజుల్లోగా ఆ వివరాలు భార్యకు ఇవ్వాలని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కు ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు జోథ్‌పుర్‌కు చెందిన రహ్మత్ బానో వేసిన అప్పీల్ మేరకు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈ ఆదేశాలు జారీ చేసింది. తన భర్త సాలరీ డిటైల్స్ చెప్పాలంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జోథ్‌పుర్‌ను ఆర్టీఏ ద్వారా రహ్మత్ బానో అడిగింది. అయితే.. థార్డ్ పర్సన్‌కు ఆ వివరాలు ఇవ్వలేమంటూ అటు నుంచి రిప్లై వచ్చింది. దీంతో సీఐసీకు అప్పీల్‌కు వెళ్లగా.. భర్త సాలరీ వివరాలు భార్యకు చెప్పాల్సిందేంటూ ఆదేశించింది హయ్యర్ అథారిటీ.
ఇక గతంలోనూ ప్రభుత్వ ఉద్యోగి జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉందంటూ పలుమార్లు ఉత్తర్వులు జారీ చేసింది సీఐసీ. ఇకపై.. గవర్నమెంట్ ఎంప్లాయిస్‌గా ఉన్న భర్తలకి.. మగాడి జీతం అడగొద్దు అనే డైలాగ్ అప్లై అవదు. అయితే.. ప్రైవేట్ ఉద్యోగులు మాత్రం ఈ రూల్ వర్తించదని చెప్పుకొచ్చింది. వాళ్లు ఎప్పటిలాగే మగాడి జీతం అడగొద్దంటూ కటింగ్ ఇవ్వొచ్చన్నమాట.