కరోనాకు మందు ఇప్పట్లో రాదా..!
వ్యాక్సిన్, హెర్డ్ ఇమ్యూనిటీ మధ్య తేడా ఏంటంటే..ఒకవేళ కొన్ని రాష్ట్రాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినా, వ్యాక్సిన్ కోసం మనం వేచి చూడక తప్పదని మరికొందరు డాక్టర్లు చెబుతున్నారు. అయితే హెర్డ్ ఇమ్యూనిటీని నమ్ముకోకుండా.. వ్యాక్సిన్ ఎప్పుడొచ్చినా భయపడకుండా.. జనాలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. మాస్కులు ధరించడం, చేతులు తరచూ కడుక్కోవడం.. భౌతిక దూరం పాటించడం మానకూడదని హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ కరోనావైరస్ వ్యాక్సీన్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా తయారుచేసినా, ప్రపంచమంతటికీ దాన్ని అందించడం చాలా పెద్ద పని. సమర్థమైన వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసి, పరీక్షించి, తయారుచేసేందుకు పట్టే సమయాన్ని వీలైనంతగా తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా సంస్థలు, పరిశోధనశాలలు ఇప్పుడు కొత్త ప్రక్రియలకు దిగుతున్నాయి. వ్యాక్సీన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అంతర్జాతీయంగా విశ్వప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, ఈ వ్యాక్సీన్ రేసులో ధనిక దేశాలు నెగ్గి, పేద దేశాలకు నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళనలు కూడా వ్యక్తమవు తున్నాయి. మరి, ఈ వ్యాక్సీన్ మొదట ఎవరికి అందుతుంది? ఎంత ధర ఉంటుంది? పేద దేశాల పరిస్థితేమిటి? ఏదైనా అంటువ్యాధికి వ్యాక్సీన్ అభివృద్ధి చేసి, పరీక్షించి, సరఫరా చేయాలంటే కొన్నేళ్ల సమయం పడుతుంది. అయినా, అది సఫలమవుతుందున్న భరోసా కూడా లేదు. ఇప్పటి వరకూ మనం అంటు వ్యాధిని పూర్తిగా నిర్మూలించగలిగాం. అదే స్మాల్‌పాక్స్. ఇందుకు 200 ఏళ్ల సమయం పట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాకు వ్యాక్సిన్ తీసుకురావడం.. వ్యాధిని నిర్మూలించగలగడం అనేది ఊహకందుతుందా.. మీరే ఆలోచించండి. ఈ లెక్కన వైరస్ నుంచి ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకే తెలుస్తుంది.