ప్రముఖ హాస్పిటల్ డైరెక్టర్ వ్యాఖ్యలు ఇపుడు సంచలనం..!

NAGARJUNA NAKKA
దేశంలో ఇప్పటిదాకా 12,48,36,819 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. రికవరీల పరంగా భారత్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. దేశంలో కరోనా విలయానికి  సంబంధించి ఆరు నెలల తర్వాత కొత్త కేసుల సంఖ్యను రికవరీల సంఖ్య అధిగమించింది. గడిచిన నెల రోజులుగా కొత్త కేసులు తగ్గుతూ వచ్చినా, శనివారం మాత్రమే ఆ సంఖ్య  రికవరీల కంటే తక్కువగా నమోదైంది. కేంద్రం లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 42,156 మంది కొవిడ్ వ్యాధి నుంచి రికవరీ అయ్యారు. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువ  ఉండటం ఇటీవల ఇదే తొలిసారి. మొత్తం 88.14లక్షల కేసులకుగానూ ఆదివారం నాటికి వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 82,05,728కు పెరిగింది.

ప్రపంచంలోనే అత్యధిక  రికవరీ రేటు భారత్ లో ఉన్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4.79లక్షలుగా ఉంది. ఇకపోతే..  వ్యాక్సిన కంటే ముందే ఇమ్యూనిటీ.. కొవిడ్-19  వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికంటే ముందే భారత్ లో ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీని పొందే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పడమే అందరికీ  టెన్షన్‌ పెడుతోంది. వ్యాక్సిన్ వచ్చేనాటికి భారత్ హెర్డ్ ఇమ్యూనిటీ దశకు చేరొచ్చు. అప్పుడు టీకాతో ప్రయోజనం ఉండదు. కాకుంటే, వైరస్ మార్పులు చెందితే..రీ ఇన్ఫెక్షన్‌ను  నివారించ డానికి వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని ఎయిమ్స్‌ చెబుతోంది.

అసలు హెర్డ్ ఇమ్యూనిటీ అంటే...జనాభాలోని పెద్ద భాగానికి ఏదైనా ఒక అంటువ్యాధి వ్యాపించి, వారు కోలుకుంటే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. అప్పుడు వాళ్లలో యాంటీబాడీస్‌  ఎక్కువగా ఉంటాయి కాబట్టి..ఆటోమేటిక్‌గా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి వస్తుంది. వ్యాధి బారినపడి కోలుకున్నవారికి ఆ వ్యాధిపై  పోరాడే రోగ నిరోధక శక్తి వచ్చేస్తుంది. ఫలితంగా వారి నుంచి మిగతా జనాలకు ఆ రోగం వ్యాపించే ముప్పు తగ్గుతుంది. అంటే, పరోక్షంగా మిగతావారికి కూడా వీరి ద్వారా రక్షణ  లభిస్తుంది.దీన్నే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. మనుషుల గుంపును ఇంగ్లీష్‌లో హెర్డ్ అంటారు. గుంపులో ఎక్కువ మందికి వైరస్ నుంచి రోగనిరోధక శక్తి లభిస్తే, వారి ద్వారా  అది మిగతావారికి వ్యాపించే ప్రమాదం తగ్గిపోతుంది. అంటే, ఒక పరిమితి తర్వాత వ్యాధి వ్యాప్తి ఆగిపోతుంది. కానీ, ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని పెద్ద పెద్ద  పరిశోధకులు, డాక్టర్లు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: