గ్రేటర్ లో ఇండిపెండెంట్ గానైనా నిలబడతారట కానీ కాంగ్రెస్ తరపున పోటీ చేయరట..?
ఇక ఇక్కడ ప్రతిపక్షాల పరిస్థితి చూస్తుంటే విచిత్రంగా ఉంది.. దుబ్బాక లో అంటే అభ్యర్థి మీద సింపతీ తో గెలిచారు కానీ గ్రేటర్ లో పరిస్థితి అంత వ్యతిరేకంగా అయితే ఏమీ లేదు. వరద బాధితుల సాయం పేరుతో ఉన్న చెడ్డ పేరు ను కేసీఆర్ తుడిచేసుకుంటున్నాడు.. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఇక్కడ గెలుపు కష్టమే అని స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది..ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ముందుగానే చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తే.. చిన్నా చితకా పార్టీల కార్యాలయాలు కూడా పెద్ద ఎత్తున కిటకిటలాడుతూ ఉంటాయి. టిక్కెట్.. టిక్కెట్ అంటూ అరుపులూ వినిపిస్తూ ఉంటాయి. టీడీపీలోనూ.. ఆశావహుల సందడి కనిపిస్తోంది కానీ.. గాంధీ భవన్ మాత్రం కార్యకర్తల జాడే లేదు. నేతలు కూడా ఎవరూ రావడం లేదు.
అయితే చాలామంది నేతలు ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తాం కానీ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగేది లేదు అని అంటున్నారట.. మరో వైపు.. డివిజన్లలో బలమైన నేతలందర్నీ బీజేపీ రాసుకుని మరీ .. పిలిచి టిక్కెట్లిస్తోంది. రకరకాల సమీకరణాలు.. ఆర్థిక మద్దతు ఆశ చూపి.. వారిని కాంగ్రెస్ తరపున కాకుండా.. తమ పార్టీ తరపున పోటీ చేసేలా చేసుకుంటోంది. బండ కార్తీక రెడ్డి, భిక్షపతియాదవ్ వంటి నేతలు ఇప్పటికే గులాబీ గూటికి చేరారు. మరి నామినేషన్ కి కొన్ని రోజులే గడువు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఈ తక్కువ టైం లో సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకుని ఎలా గెలుస్తాడో చూడాలి.