పింఛన్ దారులకు శుభవార్త.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..?

praveen
కరోనా  వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎంత ప్రభావం చూపిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు అతి తక్కువ కేసులు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఆ తర్వాత మాత్రం రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదు కావడం తో రాష్ట్ర ప్రజలందరూ బెంబేలెత్తి పోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కరోనా నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ వైరస్ మాత్రం కంట్రోల్ కాలేదు. ఇక కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా క్రమక్రమంగా క్షీణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగింది.


 ఈ క్రమంలోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా ప్రభుత్వం ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది అన్న విషయం తెలిసిందే. గతంలో నిలిపివేసిన పలు సదుపాయాలను మళ్లీ కల్పిస్తూ ముందుకు సాగుతుంది జగన్మోహన్ రెడ్డి సర్కారు. ఈ క్రమంలోనే పింఛను దారులకు శుభ వార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ఆర్థిక వ్యవస్థ క్షీణించడం తో ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు పింఛన్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఇప్పుడు వారందరికీ ఊరట కలిగించే విధంగా నిర్ణయం తీసుకుంది.



 కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు నిలిపివేసిన 50% పెన్షన్ రెండు దఫాలుగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి రాష్ట్ర  ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సత్యనారాయణ అంగీకరించారు అంటూ... ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతలో డిసెంబర్ 1వ తేదీన విడుదలయ్యే పెన్షన్ లో భాగంగా అందిస్తారు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇది ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ దారులకు శుభవార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: