నన్ను పులితో కాదు.. ఆ జంతువుతో పోల్చండి : జగ్గారెడ్డి
అంతే కాదు ఎప్పుడైనా సరే తన ప్రసంగాలతో అటు ఓటర్లను ఆకట్టుకునే సత్తా జగ్గారెడ్డి ఉంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టిఆర్ఎస్ లోని కీలక నేతలను టార్గెట్ చేస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసే విమర్శలు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఓవైపు నియోజకవర్గ అభివృద్ధి పనులు ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తూ మరోవైపు అధికారపక్షం తీరును కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉంటారు జగ్గారెడ్డి. అందుకే జగ్గారెడ్డి సంగారెడ్డి టైగర్ అని పిలుస్తూ ఉంటారు ఎంతోమంది అభిమానులు.
అయితే తనను పులి బొమ్మ తో పోల్చవద్దు అంటూ ఇటీవలే అభిమానులకు సూచించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్ లో కానీ తను పులి సింహం బొమ్మ తో అభివర్ణించ వద్దు అంటూ కార్యకర్తలకు అభిమానులకు సూచించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పులి ఒకరిని చంపి జీవిస్తూ ఉంటుందని... మనుషులమైన మనం అలాంటి జీవితాన్ని కోరుకోము అంటూ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవు మాత్రం ఎవరికి నష్టం కలిగించదని తనను అభిమానించే వారందరూ తనను ఆవు బొమ్మ తో అభివర్ణించాలి అంటూ జగ్గా రెడ్డి కోరారు.