బీజేపీ గేమ్ స్టార్ట్: కోర్ట్ మెట్లెక్కిన దుబ్బాక ఎమ్మెల్యే...?
ఎమ్మెల్యే రఘనందన్ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు రాగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని సూచించారు. రఘునందన్ రావు పిటిషన్ దాఖలు లను పరిగణనలోకి తీసుకుంది కోర్టు. అయితే ఈ కేసు విచారణను ప్రధాన న్యాయపూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ లక్ష్మణ్ ఆదేశాలు జారీ చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలలో రఘునందన్ రావు మామ అంజన్ రావు ఇంట్లో సోదా చేయడం జరిగింది. అంజన్ రావు ఇంట్లో రూ.18.67 లక్షలు పట్టుబడ్డాయని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పేర్కొన్నారు.
రఘునందన్ అనుచరులు రూ.12.80 లక్షలు ఎత్తుకెళ్లారని తెలిపారు. 30 మందిని గుర్తించామని వారిపై కేసులు నమోదు చేస్తామని జోయల్ డేవిస్ పేర్కొన్నారు. అయితే ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బులు దొరికాయని బీజేపీ శ్రేణులు ఆరోపించగా.. ఆ డబ్బంతా రఘునందన్ రావుదే అని టీఆర్ ఎస్ ప్రచారం చేసింది. కాగా కట్టు కథలు అల్లి తనపై ఆరోపణలు చేశారని కోర్టును ఆశ్రయించారు రఘునందన్ రావు. ఇప్పుడు ఈ కేసులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోనున్నాయో చూడాలి.