హరీష్ ప్రాధాన్యం తగ్గినట్టే గా ? రాజీనామా చేస్తారా ?


తెలంగాణలో హోరాహోరీగా జరిగిన దుబ్బాక ఉపఎన్నికల తంతు అధికార పార్టీ పూర్తిగా నిరాశా నిస్పృహల్లో కి తీసుకెళ్ళింది. ఇప్పటి వరకు తెలంగాణలో తమకు తిరుగు లేదని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన ఆ పార్టీకి దుబ్బాక ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. టిఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన దుబ్బాకలో ఓటమి చెందుతామని, ఆ పార్టీ నేతలు ఎవరూ ఊహించలేకపోయారు. కాకపోతే బీజెపీ కాస్త బలపడటంతో మెజారిటీ మాత్రమే తగ్గుతుందని అంచనా వేయగా , బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. 1470 ఓట్ల తేడాతో సోలిపేట సుజాత పై ఆయన విజయం సాధించారు.  ఇది ఇలా ఉంటే, ఇక్కడ అన్నీ తానే టిఆర్ఎస్ తరఫున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి, దుబ్బాక ఉప ఎన్నికల బరువు బాధ్యతలను తనపై వేసుకున్న హరీష్ రావు పైన ఇప్పుడు అందరి దృష్టి పడింది. 



ఎన్నికల బాధ్యతలను ఆయన స్వీకరించారు కాబట్టి ఎన్నికల్లో ఓటమి బాధ్యతలను ఆయన తీసుకుంటారా ? ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే విషయం పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే దుబ్బాక లో ఓటమి బాధ్యత నాదే అని హరీశ్ ప్రకటించిన నేపథ్యంలో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే విధంగా కనిపిస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన రెండోసారి హరీష్ కు కేసీఆర్ ప్రాధాన్యం తగ్గించారు. మంత్రి పదవి ఇవ్వకుండా చాలాసార్లు వెయిటింగ్ లో పెట్టారు. తన కుమారుడు కేటీఆర్ ను ప్రమోట్ చేసుకునేందుకు హరీష్ రావు అర్థం కాకూడదనే ఉద్దేశంతో ఆయన పక్కకు తప్పించారు అనే వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో జోరుగా వినిపించాయి. 



ఇకపై ఆయనకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని అంతా భావించారు. దానికి తగ్గట్లుగానే కేసీఆర్ వ్యవహరించడంతో, అప్పట్లో హరీష్ సైతం కాస్త అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాత మంత్రి పదవి దక్కడం తో హరీష్ కూడా మామూలుగానే ఉంటూ వచ్చారు.ఇక తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా, హరీష్ అన్ని తానే వ్యవహరిస్తూ గెలుపు టిఆర్ఎస్ ఖాతాలో వేస్తూ వచ్చరున్ కానీ ఇక్కడ ఈ రకమైన ఫలితాలు వస్తాయని ఊహించలేకపోయారు. ఇదిలా ఉంటే ఇప్పుడు హరీష్ టిఆర్ఎస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారననే ప్రచారం ఊపు అందుకుంది. అయితే ఈ విషయంలో ఎటువంటి స్పష్టత లేనప్పటికీ, హరీష్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.



 అసలు దుబ్బాకలో టిఆర్ఎస్ కు ఓటమి చెందుతుందని కేసీఆర్ కు ముందే తెలుసునని, అందుకే ఆయన కుమారుడు కేటీఆర్ ను ఎన్నికల ప్రచారానికి పంపకుండా దూరంగా ఉంచారు అని, అప్పుడే ప్రచారం మొదలైంది. కేసీఆర్ హరీష్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటారా ? లేక  హరీష్ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉత్కంఠ కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: