వణికిపోతున్న తెలంగాణ ప్రజలు.. ముఖ్యంగా ఆ నాలుగు జిల్లాలే..?
ఎముకలు కొరికే చలిలో వణికి పోతున్నారు రాష్ట్ర ప్రజలు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తీవ్రత మరింత పెరుగుతూ ఉండడంతో... రాష్ట్ర ప్రజలందరూ గజగజ వణికిపోతున్నారు. ఇక క్రమక్రమంగా రాష్ట్రంలో రాత్రి సమయంలో ఉష్ణోగ్రత లు భారీగా పడిపోతున్నాయని అటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం గానే నమోదు అవుతున్నప్పటికీ రాత్రి సమయంలో మాత్రం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గి పోతున్నాయని... వాతావరణ శాఖ తెలిపింది. అయితే రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ మెదక్ హైదరాబాద్ నిజాంబాద్ జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న ట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇక ఈ నాలుగు జిల్లాల్లో అయితే రోజురోజుకు రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేవలం నవంబర్ మొదటివారంలోనే పరిస్థితులు ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండబోతాయోనని అటు ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.