ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే ఇవి తప్పక అనుసరించాలి..!
ఇంటర్వ్యూలో సమావేశాలు ఎల్లప్పుడూ వన్ ఆన్ వన్ పద్ధతిలో ఉంటాయి అని మనకి తెలిసినదే. తప్పకుండ మీరు కమ్యూనికేట్ చేయడానికి, కలుపుగోలుపుతనంగా మాట్లాడానికి ప్రయత్నించాలి. ఇది మాత్రం మరచిపోకండి. అలానే ఇంటర్వ్యూ ప్రక్రియకు ముందు జరిగే సంభాషణల్లో అడిగేది లక్ష్యం గురించి. లక్ష్యాల పట్ల ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు? వాస్తవికమైన గోల్స్ ను చెబుతున్నారా? సమస్యలో పడితే ఏం చేస్తారు? వంటివి అడుగుతారు కాబట్టి మీకు మీరు స్వతంత్రంగా ఆలోచించగలరని నిరూపించాలి గుర్తుంచుకోండి.
ఇంటర్వ్యూకు వెళ్లే వారు గమనించాల్సిన విషయాలు ఏమిటంటే...? వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ఇంతకు ముందు కంపెనీ మీ పని అనుభవం, బయట మీ అభిరుచులు ఇటువంటి ప్రసంగాలు అడిగి మీ గురింఛి వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఇవి మీరు ముందే గమనించండి. నిర్వాహకులు నైపుణ్యం కలిగిన వారికే ముందు ప్రాధాన్యత చేస్తారు. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ని కూడా చెప్పాలి. అలానే మీరు ఏ పని చేస్తున్నారో వారికి తప్పని సరిగా తెలియజేయాలి. మీ అనుభవాన్ని బట్టి కూడా ప్రాధాన్యత ఉంటుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే వారికి కంపెనీలు తీసుకునేందుకు ఆసక్తి కనపరుస్తాయి. చాలా వరకు, తమను తాము నిర్వహించడానికి చాలా తక్కువ పర్యవేక్షణ అవసరమయ్యే అభ్యర్థుల కోసం ఎదురు చూస్తారు. అవతలి వ్యక్తికి స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛను ఇచ్చినప్పుడే కుదురుతుంది. . నిర్వాహకులు ఈ అంశాలను పరిశీలిస్తారు.