గుడ్ న్యూస్ : సబ్సిడీపై కార్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..?
గిరిజన యువత అందరికీ కూడా స్వయం ఉపాధి కల్పించే విధంగా నాలుగు చక్రాల వాహనాన్ని సబ్సిడీపై అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ పథకం తో గిరిజన యువతకు ఎంతో చేయూత కలగనుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎనిమిదవ తరగతి పాసై 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న గిరిజన యువతకు... ఈ పథకం వర్తిస్తుంది అని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించి నాలుగు చక్రాల వాహనాలు కొనడంతో పాటు ఈ వాహనాలపై సబ్సిడీ కూడా అందించేందుకు సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది గిరిజన సంక్షేమ శాఖ.
గ్రామీణ ప్రాంతాల వారు అయితే 1.5 లక్షలు పట్టణ ప్రాంతాల వారు అయితే రెండు లక్షల వార్షిక ఆదాయం మించకుండా ఉండాలి అంటూ నిబంధన విధించింది. నాలుగు చక్రాల వాహనం లో ఏ వాహనాలకు అయినా సరే 2.88 లక్షల సబ్సిడీ అందిస్తాము అంటూ గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. ఇక వాహనం విలువలో 10 శాతం లేదా 50 వేల రూపాయలను వినియోగదారుడు వాటా విలువ గా నిర్ణయించిన తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మిగతాది మొత్తం బ్యాంకు రుణం రూపంలో కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.