అందులో యువతులకు వేధింపులు నిజమేనా..?

NAGARJUNA NAKKA
పెళ్లిళ్లు ఎనిమిది రకాలని మన పెద్దలంటారు. వీటిలో గాంధర్వ, అసుర, రాక్షస, పైశాచిక వివాహాలు సమస్యాత్మకమైనవి. స్వతహాగా ప్రేమ పెళ్లిళ్లు గాంధర్వ వివాహాల కిందికి వస్తాయి. గాంధర్వం అంటే ప్రేమికులిద్దరూ పరస్పర సమ్మతంతో పెళ్లి చేసుకోవడం. కానీ లవ్ జిహాద్‌లో యువతులకు ఇష్టాన్ని కష్టంగా తెప్పించి మరీ పెళ్ళి ఉచ్చులోకి లాగుతున్నారనీ, మతమార్పిడే ధ్యేయంగా ఇదంతా జరుగుతోందని కొందరు గట్టిగానే వాదిస్తున్నారు. మత వ్యాప్తే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ.

లవ్ జిహాద్ కార్యకలాపాలు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయనేందుకు కూడా గతంలో కొన్ని ఆధారాలు వెల్లడయ్యాయి. ది కలర్ అబ్యూజ్ పేరిట పత్రికల్లో రెండేళ్ల కిందటే దీనిపై కథనాలు కూడా వచ్చాయి. లండన్‌లో కొందరు పాకిస్థాన్ యువకులు యువతులను ఎలా లోబరుచుకున్నారు? మత్తుమందులకు ఎలా బానిసల్ని చేస్తున్నారు? తర్వాత ఏవిధంగా మతం మార్పిడికి పాల్పడుతున్నారు? అన్న వార్తలు ఎన్నడో వెలుగు చూశాయి. ఆడపిల్లల్ని లోబరుచుకొని మతం మార్చే చర్యలు కేవలం లండన్ లోనే కాదు.. అమెరికా ఫ్రాన్స్ దేశాల్లో కూడా అడపాదడపా సాగుతున్నాయంటున్నారు నిపుణులు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో లవ్ జిహాదీలు కర్కశంగా ప్రవర్తిస్తున్న ఆధారాలున్నాయి‌. ఆ దేశాల్లో ప్రధాన లక్ష్యం హిందూ యువతులే. మొదట వారిని కిడ్నాప్ చేస్తారు. తమ లైంగిక వాంఛ తీర్చుకుని ఎవరో ఒకరికిచ్చి వివాహం చేస్తారు. తర్వాత తానొకరి భార్యగా జీవించాలనుకుంటున్నానని ఆ యువతితో ప్రకటన ఇప్పిస్తారు. ఇందులో ఎలాంటి ప్రేమకలాపాలుండవు. దౌర్జన్యంగా లైంగిక హింసను ఆయుధంగా ప్రయోగించి మతం మార్చేయడమే ఇందులో ప్రధానం అన్న ఆరోపణలున్నాయ్‌.

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పటి వరకూ ఇలాంటి సంఘటనలు పెద్దగా నమోదు కాలేదు. అయితే, హైదరాబాద్ పాత బస్తీతో పాటు తెలంగాణ జిల్లాల్లోని పలుచోట్ల పర మతస్తులైన యువతుల్ని లక్ష్యంగా చేసుకుని ప్రేమ వివాహాలకు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హిందూ వాహిని, ధర్మరక్షాసమితి వంటి సంస్థలు దీనిపై ఫిర్యాదులు చేస్తున్నాయ్‌. మతమార్పిడే లక్ష్యంగా చేసుకుని ప్రేమలోకి దించి పెళ్ళి ఉచ్చులో బిగించే చర్యలు ఎక్కడ జరిగినా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నదే ఎక్కువమంది ఎక్కువ మంది అభిప్రాయం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: