వస్తున్న మీకోసంలో యాత్రలో ‘నారా’ నూరు కిలోమీటర్లు దాటేశాడు. అవకాశవాద కాంగ్రెస్ ను అవినీతి మయమైన వైకాపాలను నమ్మెద్దంటూ జనాలకు నూరిపోస్తున్నాడు. ప్రజలకోసం నూటికి నూరుపాళ్ళు శ్రమిస్తానని తేల్చిచెబుతున్నాడు. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ బాబు యాత్ర సాగుతూనే ఉంది. ఇకపై నష్టపోయిన అన్నదాతలకు అండగా నిలుస్తాడట. చీకటికమ్ముకున్న రాష్ట్రంలో చంద్రుడై వెలుగునింపేస్తాడట.
చంద్రబాబు మీ కోసం వస్తున్నా అంటూ చేస్తున్న పాదయాత్రకు ప్రజల్లొ కొంత స్పందన కనిస్తునే ఉంది. చంద్రబాబు అధికారంలోని వస్తున్నాడంటే అధికారులకు హడలే. నిత్యం అధికారులు ప్రజాసేవలో ఉండాలని గతంలో ఆయన అధికారులకు ముచ్చెమటలు పట్టించిన విషయం విధితమే. ఈక్రమంలో తాను నిద్రపోనూ అధికారులను నిద్రపోనివ్వనని ఆయన మాటలు ఇప్పటికీ అధికారులు మరిచిపోలేక పోతున్నారు. కాగా వరుస కరువు వెంటాడినా రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపించకుండా పాలన సాగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తేల్చిచెప్పేయవచ్చు.
ఇదిలావుండగా తాజాగా పాదయాత్ర సాగిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ సర్కారు సంక్షేమ పథకాల మాటున ప్రజలను మభ్యపెడుతోందని చంద్రబాబు మండిపడుతున్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను నీరుగార్చారని ఆరోపణలు చేస్తున్నారు. నాడు వైఎస్ మాటలను నమ్మి గద్దె నెక్కించారు. అయితే అధికారం అడ్డంపెట్టుకుని అక్రమంగా కోట్ల రూపాయలు ఆర్జించినందుకు నేడు యువనేతకు అరదండాలు పడ్డాయని బాబు వివరిస్తున్నాడు. అలాగే అసమర్థ నేతతో పాలన సాగిస్తున్న కాంగ్రెస్కు ఇక రోజులు దగ్గరపడ్డాయని బాబు తేల్చిచెబుతున్నారు.
స్వపక్షంలో ఉన్న వారే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ పాలనను పడకేయించారని బాబు ఎద్దేవ చేశారు. ప్రజలకు సుభీక్షమైన పాలన అందించడం కేవలం తెలుగుదేశం పార్టీకే సాధ్యమని నారా తన పాదయాత్రలో ప్రజలకు నూరిపోస్తున్నాడు. ఇకపై నేను . నేను మారాను? మీరు మారాలి? అని చెబుతూ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. అష్టకష్టాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచిరోజులు మరికొంత దూరంలోనే ఉన్నాయని తెలుగుదేశం నేతలు తేల్చిచెబుతున్నారు.
అధికారం చాటున కోట్లాది రూపాయలు కైంకర్యం చేసిన యువనేత బండారాన్ని ప్రజలకు వివరించాలని. అసమర్థ నాయకత్వంతో ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న కిరణ్ సర్కారు నిజస్వరూపాన్ని ప్రజలకు విప్పి చెప్పాలని తెలుగుదేశం శ్రేణులకు బాబు ఆదేశాలిచ్చాడు. కాగా చంద్రబాబు ‘మీకోసం వస్తున్నా‘నంటూ పాదయాత్ర నూరుకిలోమీటర్లు దాటంది. చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర ఫలాలు స్థానిక ఎన్నికల్లో కనిపిస్తాయా అన్నది వేచిచూడాలి మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: