దుబ్బాక ఉప ఎన్నికల్లో.. ఏపీ సీఎం జగన్ ప్రస్తావన..?
ముఖ్యంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతివిమర్శలు పర్వం కొనసాగుతూనే ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి నేడు సాయంత్రంతో తెరపడనుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బీజేపీ పై మరోసారి మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు మంత్రి హరీష్ రావు.
ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తారు.. ఇందుకు నిదర్శనం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ హరీష్ రావు విమర్శించారు. బీజేపీకి మద్దతు ఇచ్చిన సీఎం జగన్ ప్రస్తుతం ఏపీలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. సీఎం జగన్ లాగా తమ ప్రభుత్వం మాత్రం బోరు మోటార్ల మీటర్లు బిగించదని రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని.. తమది రైతు ప్రభుత్వం అని తెలిపారు హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభించడం లో భాగంగానే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి అధిక బిల్లులు వసూలు చేయడమే ఈ చట్టం అంటూ ఆరోపించారు. గతంలో కూడా మంత్రి హరీష్ రావు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.