టీకా వచ్చినా.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా ?

NAGARJUNA NAKKA
వాస్తవానికి వ్యాక్సిన్‌ తయారీ విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఏకమయ్యాయి‌. కష్టకాలంలో అన్ని దేశాలు పరస్పరం సహకరించుకున్నాయి‌. పలు దేశాల్లో మొదలైన ట్రయల్స్‌లో రెండు దశల వరకు సక్సెస్‌ అయ్యాయి‌. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని అంతా భావించారు. కానీ ఒక్కసారిగా వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై గందరగోళం ఏర్పడింది.  కొన్ని దేశాలు ఎప్పుడు ఐతే రాజకీయంగా జోక్యం చేసుకున్నాయో అప్పుడే  ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు నిపుణులు.
ఏదైనా వ్యాక్సిన్‌ తయారు చేయాలంటే చాలా సమయం పడుతోంది. దాదాపు ఏడాదిన్నర సమయం పడుతుందని నిపుణులు అంచనా. యూకే, అమెరికా, బ్రెజిల్, జపాన్, సౌతాఫ్రికా దేశాల్లో ఆస్ట్రాజెనెకా నిర్వహిస్తున్న హ్యు మన్ ట్రయల్స్‌లో మొత్తంగా 50వేల మంది పాల్గొంటున్నారు. చాలా ట్రయల్స్‌లో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. అస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో కూడా ఇదే జరిగింది. వ్యాక్సిన్‌ వికటించి ఒక వలంటీర్‌ మరణించాడు. అయితే మరణాల కారణాలు మాత్రం ఇంత వరకూ వెల్లండిచలేదు. వ్యాక్సిన్‌ వికటించి చనిపోయాడా? కారణం ఏంటనేది చర్చనీయాంశంగా మరింది. అయితే అస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలు మాత్రం వ్యాక్సిన్‌ ప్రబావం వల్ల చనిపోలేదని చెప్పుకొచ్చాయి.
ప్రతి మెడిసిన్‌కు ఏదో ఒక సైడ్‌ ఎఫెక్ట్ ఉంటుంది.ఆఖరికి పారాసెటమాల్‌కు కూడా ఏదో ఒక దుష్ప్రభావం ఉంటుంది.కాకపోతే కరోనా వైరస్‌ వ్యాధి వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి చూశాకే.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎంతమేరకు ఉంటుందనేది తెలుస్తుంది. మూడు దశల్లో సక్సెస్ అయ్యాకే వ్యాక్సిన్‌ను అందబాటులోకి తెస్తారని వివరిస్తున్నారు నిపుణులు.
ఇక ఇప్పటికే  ప్రజలకు కరోనాపై ఓ అవగాహన వచ్చింది. కొంత మంది వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూడకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరొకొంత మంది కరోనానను లైట్ తీసుకుంటున్నారు. మాస్క్‌లు లేకుండా రోడ్లపైకి వస్తున్నారు.
ఏది ఏమైనా వ్యాక్సిన్‌ రావడానికి మరో ఏడాది సమయం పడుతుందని అప్పటి వరకు ప్రజలు.. జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: