తస్మాత్ జాగ్రత్త.. మళ్లీ వస్తుంది.. ఐసీఎంఆర్ హెచ్చరికలు..?
రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది అనే విషయం తెలిసిందే. అదే ఆ సమయంలో దేశంలో రికవరీ రేటు కూడా ఎక్కువ స్థాయిలో ఉండడం ప్రస్తుతం ప్రజలందరిలో కాస్త ధైర్యం నింపుతుంది. అందుకే అన్లాక్ మార్గదర్శకాల లో భాగంగా తగిన జాగ్రత్తలు మధ్య అన్ని రకాల కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు ప్రజలు. అయితే ఈ మధ్య కాలంలో దేశంలో పలు ప్రాంతాలలో రెండవసారి కరోనా సోకిన కేసులు కూడా తెర మీదికి వస్తుండటం ప్రజలందరిలో ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడం కూడా మరింత భయాందోళనకు గురిచేస్తుంది.
ఇక ఇటీవల ఇదే విషయంపై ఐసీఎంఆర్ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ బారినపడి కోరుకున్న వారిలో కూడా మళ్ళీ ఐదు నెలల్లో యాంటీ బాడీ లు తగ్గితే కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అందుకే కరోనా వైరస్ బారినపడి చికిత్స తీసుకొని కోరుకున్నవారు నిర్లక్ష్యం చేయకుండా మాస్కులు ధరించడం తో పాటు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి తగిన జాగ్రత్తలు పాటించాలి అంటూ ఐసీఎంఆర్ హెచ్చరించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 24 రీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవగా భారత్లో ఇప్పటివరకు 3 రీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.