
భారీ వర్షం.. కుప్పకూలిన గోల్కొండ కోట.?
ఎక్కడికక్కడ డ్రైనేజీ నాళాలు కూరుకుపోయి... వరద నీరు మురికి నీరు మొత్తం ఇళ్లలోకి చేరడంతో ఆ వాసన తట్టుకోలేక నరకం అనుభవించారూ నగర వాసులు అందరూ. ఇలా పూర్తిగా నగరం మొత్తం జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. భారీ వర్షం పడి రెండు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ నగరం మొత్తం భారీ వరదల నుంచి తేరుకోలేక పోయింది. ఇప్పటికే అధికారులు ముమ్మర సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇప్పటికే పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు ఎన్నో ఇళ్ళు కూడా జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి.
అయితే ఇటీవలే కురిసిన భారీ వర్షానికి ఏకంగా ఎన్నో భవనాలు కూడా కూలిపోయిన విషయం తెలిసిందే. ఇక కేవలం భవనాలు మాత్రమే కాదు పురాతన కట్టడాలు కూడా కూలి పోవడం గమనార్హం. గోల్కొండ కోట లోని శ్రీ జగదాంబికా అమ్మవారి ఆలయం ముందు ఉన్న దాదాపు 27 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా నేపథ్యంలో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండడంతో ప్రమాదం తప్పిందని గోల్కొండ నిర్వాహకులు తెలిపారు. పది నెలల క్రితమే ఈ గోడపై ధ్వంసమైన కొన్ని బురుజులను పురావస్తు శాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. కాగా ప్రహరీ గోడ కిందిభాగంలో పగుళ్లు వచ్చిన నేపథ్యంలో... మొన్న కురిసిన భారీ వర్షానికి ఈ గోడ మొత్తం కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది.