మహారాష్ట్రలో 40 మంది మృతి.. కరోనాతో కాదు.. ఎలాగంటే..?

praveen
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎన్నో రాష్ట్రాలు అతలాకుతలమై పోతున్న విషయం తెలిసిందే. నగరాలు పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా పూర్తిగా జలదిగ్బంధంలో కి వెళ్లి పోతున్నాయి అన్ని ప్రాంతాలు. దీంతో జనజీవనం మొత్తం స్తంభించిపోయి ఎక్కడికక్కడ భవనాలు కూలిపోయి పూర్తిగా అతలాకుతలమవుతోంది అంతే కాకుండా భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరుగుతూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మహారాష్ట్రలోని ముంబై నగరం మొత్తం తీవ్రంగా జలదిగ్బంధంలో లోకి వెళ్ళిపోయి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.



 ముంబాయ్ లో మాత్రమే కాకుండా పూర్తిగా మహారాష్ట్రలో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్లిపోయాయి . ఎక్కడ చూసినా పూర్తిగా వరద నీటితో నిండిపోవడం తో పెద్ద పెద్ద చెరువులను తలపిస్తు... అక్కడ భవన సముదాయం కాదు పెద్ద పెద్ద చెరువులు ఉండేవి అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గినప్పటికీ ఆ వరద ప్రభావం మాత్రం ఇప్పటికీ కూడా తగ్గడం లేదు. దీంతో ఎంతో మంది ప్రజలు ఇప్పటికీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటికే కరోనా  వైరస్ తో బెంబేలెత్తిపోతున్న జనాలు ప్రస్తుతం వరదలతో కూడా మరింత భయాందోళనకు గురవుతున్నారు.



 అది మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏకంగా మూడు రోజుల వ్యవధిలో 48 మంది వరకు వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు  తెలుస్తోంది. పూణే డివిజన్లో 29 మంది ఔరంగాబాద్ డివిజన్లో 19 మంది.. కొంకణ్  డివిజన్ లో ముగ్గురు వరదల కారణంగా చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇక వరదల్లో చిక్కుకుపోయిన 40  వేలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిని భారీ నష్టం వాటిల్లినట్లు చెప్పుకొచ్చారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: