క్రెడిట్ అంతా కేశినేనిదే...!

దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం అయిన సందర్భంగా విజయవాడ కేశినేని భవన్ లో టీడీపీ కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా మాట్లాడుతూ... ఎంపీ నాని విజయవాడ ప్రజలకి  విజయదశమి కానుకగా బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్,దుర్గ గుడి ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. విజయవాడ ప్రజల చిరకాల వాంఛ..దుర్గ గుడి ఫ్లై ఓవర్ అని ఆయన కొనియాడారు. చంద్రబాబు నాయుడు కృషి,ఎంపీ నాని కి ఉన్న పలుకుబడి వల్లే ఇది సాధ్యం అయిందన్నారు.
వైసీపీ ఇది మా గొప్పతనం అని చెప్పుకుంటుంది..అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో వర్షం పడితే 1 టౌన్ లో  పడవలు వేసుకుని వెళ్లేవారని అన్నారు. ఇవ్వాళ అలాంటిది లేకుండా డ్రైనేజీ వ్యవస్థ బాగుపడి ఉందంటే దానికి కారణం నాని అని కీర్తించారు. విజయవాడ పార్లమెంటరీ  పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాట్లాడుతూ... ప్రజలు కోరుకున్న ఇంద్ర కీలాద్రి ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చిందన్నారు. నాని తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం సాకారం అయిందనన్నారు.
ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 130 కోట్ల రూపాయలు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని ఆయన వివరించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబందించిన పూర్తి క్రెడిట్ టీడీపీ ప్రభుత్వానిదే అని వివరించారు. బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఈ రోజు శంఖుస్థాపన చేశారని ఆయన అన్నారు. అభివృద్ధి అనే మాటకు ఈప్రభుత్వం స్థానం లేకుండా చేసిందని చెప్పారు. రోడ్లన్నీ పాడయిపోయాయి..వర్షానికి మరింత పాడయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేసారు. తీరం దాటేటప్పుడు కానీ ఈ ప్రభుత్వం సహాయక చర్యలు పాటించలేదని విమర్శించారు. 43 వేల కోట్ల రూపాయల కేసుల్లో ఉన్న వ్యక్తి ఫ్రస్ట్రేషన్ లో న్యాయ వ్యవస్థ మీదే దాడి చేస్తున్నారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: