పొదల చాటుకు వెళ్లిన మహిళలు.. ఏంటా అని వెళ్లి చూస్తే షాక్..?
అయితే మొన్నటి వరకు కేవలం మగవారు మాత్రమే పేకాట ఆడే వారు కానీ ప్రస్తుత రోజుల్లో రోజుకు పేకాటలో మునిగితేలుతున్న మహిళలు కూడా ఎక్కువ అయిపోతున్నారు. ఇప్పటికే ఎన్నో మహిళా పేకాట ముఠాల్ని పోలీసులు పట్టుకుని అరెస్టు చేసిన ఘటనలు కూడా ఎన్నో తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఎవరికీ తెలియకుండా ఎంతో గుట్టుగా పొదలమాటున కూర్చుని పేకాట ఆడుతున్న కొంతమంది మహిళల ముఠాను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారు. ఇక మహిళా ముఠా సభ్యులు పేకాట ఆడుతూ దొరికి పోవడంతో స్థానికంగా ఈ ఘటన సంచలనం గా మారిపోయింది.
షాకింగ్ ఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ లో వెలుగులోకి వచ్చింది. కొంతమంది మహిళల ముఠా ఎంతో రహస్యంగా పొదలమాటున వెళ్లి కూర్చున్నారు. అయితే ఇంతలో వారిని గమనించిన స్థానికులు ఏంటా అని ఆసక్తికరంగా దగ్గరికి వెళ్లి చూసారూ. అంతలో షాక్ అక్కడ మహిళలందరూ పేకాట ఆడుతూ కనిపించారు దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పేకాట ఆడుతున్న మహిళలను అరెస్టు చేశారు. ఇక ఈ క్రమంలోనే ఆరుగురు మహిళల సహా ఓ యువకుని కూడా అరెస్టు చేసిన పోలీసులు వారిని జైలుకు పంపించారు. వారి దగ్గర నుంచి విలువైన వస్తువులు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.