చిగురుటాకుల్లా వణుకుతున్న హైదరాబాద్ వాసులు...!

Suma Kallamadi
ఒక పక్క కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే..... ఇప్పుడు  చినుకు తో కష్టాలు వచ్చాయి బస్తీవాసులకి. వారి జీవనాలు ఛిద్రమైపోతున్నాయి. ఈ భారీ వర్షాల ఫలితంగా 150 కి పైగా ప్రాంతాలు నదులను తలపిస్తూ ఆస్తి ప్రాణ నష్టాలను మిగిల్చాయి. వందేళ్లల్లో రెండో సారి కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం తట్టుకో లేకపోతోంది. వాన అంటే చాలు ఇక్కడ ప్రజలు చిగురుటాకులా వణుకుతున్నారు. ఈ భారీ వర్షల వల్ల ఎంతో నష్టం కలిగింది.
తాజాగా వాతావరణ శాఖ ఇలా  హెచ్చరించింది..... వాయుగుండం కారణంగా మరో రెండు రోజులు హైదరాబాద్ కి భారీ వర్షాలు తప్పవంది. దీనితో మరింత ఆందోళన చెందుతున్నారు ప్రజలు.   ఒక్కరోజు 30 సెంటీమీటర్ల కు పైగా పడిన భారీ వర్షానికి పలువురు కొట్టుకుపోయి ప్రాణాలు విడువగా......  కొందరు విద్యుత్ షాక్ లతో కన్ను మూశారు. ఇలా ఎన్నో ఘోర సంఘటనలు చోటు చేసుకున్నాయి.  ఇళ్ళు నేలమట్టం అవ్వడం, వందలాది  కార్లు, వేలాది ద్విచక్ర వాహనాల నష్టం చోటు చేసుకోవడం జరిగింది. రాబోయే విపత్తులను అంచనా వేసి డ్రైన్ల నిర్మాణం చేయకపోవడం ప్రజల పాలిట శాపంగా మారిపోయింది.
ఇప్పటికైనా  డ్రైన్ల పై శ్రద్ద పెట్టి ఎప్పటికప్పుడు సిల్ట్ క్లిన్ చేయడం వంటి కార్యక్రమాలను జి హెచ్ ఎం సి ప్రణాళికా బద్దంగా చేపట్టడం మంచిది. ఇలా కనుక చెయ్యకపోతే  భారీ వర్షాలు సంభవిస్తే సిటీ హుస్సేన్ సాగర్ అయిపోతుందన్న చేదు నిజాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్ధం అవుతున్నాయి. అలానే  నీటి మార్గానికి అడ్డంకులు లేకుండా చూడటం ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలి. అవసరమైన చర్యలు తీసుకోకపోతే మహానగరం అంతా చెరువై పోతుంది. కోట్లాది మంది కొలువైన భాగ్యనగరం విశ్వ నగర ఖ్యాతి ఇనుమడించాలి అంటే తప్పక అవసరమైన చర్యలు తీసుకుని అవసరమైన పనులు చెయ్యకపోతే ప్రజలకి ఇవే ఇక్కట్లు తప్పవు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: